Upasana : మెగాస్టార్ చిరంజీవి కోడలు, ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఉపాసన, రామ్ చరణ్.. పిల్లల టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల తను ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ను పిల్లల గురించి ఉపాసన ఓ ప్రశ్న అడిగింది. అందరూ పిల్లలను ఇంకెప్పుడు కంటావు అని ప్రశ్నిస్తున్నారు. ఏం సమాధానం చెప్పాలి అంటూ ఆయన్ను ఉపాసన ప్రశ్నించింది. పెళ్లిళ్ల గురించి.. పిల్లలపై గురించి ఆమె ఆయనతో కాసేపు మాట్లాడింది.

పిల్లల గురించి రామ్ చరణ్, ఉపాసనకు కూడా టెన్షన్ ఉందని త్వరలోనే వాళ్లు మెగా ఫ్యామిలీకే కాదు.. మెగా అభిమానులకు కూడా గుడ్ న్యూస్ చెబుతారని అంతా సంబురపడుతున్ననేపథ్యంలో అసలు తాము ఇప్పటి వరకు పిల్లలను ఎందుకు కనలేదో అసలు నిజం చెప్పేసింది ఉపాసన.
Upasana : ఇప్పటి వరకు పిల్లలను కనొద్దని మాట తీసుకున్నాం
పెళ్లయిన తర్వాత ఓ 10 ఏళ్ల పాటు పిల్లలను కనొద్దని ఆమె ఓ వ్యక్తి దగ్గర మాట తీసుకున్నారట. ఓ 10 ఏళ్ల పాటు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని.. సామాజిక సేవ చేసిన తర్వాత అనుకున్న లక్ష్యాలు నెరవేరిన తర్వాత తాను పిల్లలను కంటా అని మాట తీసుకున్నదట. ఆ మాట ప్రకారమే ఉపాసన ఇప్పటి వరకు పిల్లలను కనలేదట.
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అంటారా? ఇంకెవరు.. అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ రెడ్డి. అందుకే తను ఇప్పటి వరకు పిల్లలను కనలేదని స్పష్టం అవుతోంది. పెళ్లయిన 10 వరకు పిల్లలను కనకుండా.. సేవ చేస్తూ కష్టపడతానని తన తాతకు అప్పట్లోనే ఉపాసన మాట ఇచ్చిందట. ఆమాటకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చింది.
అంటే.. తన తాతకు ఇచ్చిన మాట అయిపోయింది కదా. ఉపాసన, రామ్ చరణ్ పెళ్లి అయి 10 ఏళ్లు అయిపోయింది. అంటే ఇప్పుడు ఉపాసన పిల్లలను కనేందుకు రెడీ అయిపోయిందన్నమాట. ఇదే నిజం అయితే ఇంకో సంవత్సరం తిరిగే లోపు మెగా ఫ్యామిలీలోకి వారసుడు రాబోతున్నాడన్నమాట.