Anasuya : బుల్లితెరపై యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది అనసూయ. తన అందంతో అటు బుల్లితెరలో, ఇటు వెండితెరలో తన హవాను కొనసాగిస్తుంది. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా అనసూయ హాట్ నెస్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గదు. నడి వయసు దాటేస్తున్న కూడా ఆమెను ఎవరైనా ఆంటీ అని పిలిస్తే వారికి చివాట్లు పెడుతుంది. సోషల్ మీడియాలో తనని ఎవరైనా టార్గెట్ చేస్తే చాలు అనసూయ ఏమాత్రం వెనక్కి తగ్గదు. తనని విమర్శించే వాళ్లకు తాను ఎప్పుడైనా బుద్ధి చెబుతానని, ఆత్మగౌరవం కాపాడుకునే విషయంలో ఎక్కడిదాకా అయినా వెళ్తాను అని చెబుతుంటుంది.
Anasuya : అనసూయ చుట్టూ ఇంత జరుగుతుందా…
అయితే తాజాగా అనసూయ కొందరు కావాలని టార్గెట్ చేస్తున్నారని వాపోతోంది. తాజాగా లైగర్ సినిమా రిలీజ్ రోజున అనసూయ ను విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చాలా గట్టిగా టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే అనసూయ కూడా ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కౌంటర్ వేస్తూ వచ్చింది. ఆ తర్వాత అనసూయ క్రేజ్ అసాధారణంగా పెరిగిపోయింది. ఇక అనసూయ బుల్లితెరలో చేస్తూనే వెండితెరపై కూడా అవకాశాలను దక్కించుకుంటుంది. దీంతో కొందరు ఇండస్ట్రీ వాళ్లే ఆమె ఎదుగుదల చూసి ఓర్వలేక రకరకాలుగా టార్గెట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

అందుకే ఆమె డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో ఇతర యాంకర్లతో పోల్చి చూస్తూ కామెంట్లు చేస్తున్నారని చర్చలు కూడా జరుగుతున్నాయి. కొందరైతే ఆమె ఇమేజ్ కు దెబ్బ కొట్టేందుకు నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తూ హ్యాష్ ట్యాగ్ లు పెట్టి నెగిటివ్ గా ట్రెండ్ చేస్తున్నారు. అయితే తన చుట్టూ ఎంత జరుగుతున్న అనసూయ మాత్రం వాటిని ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఎప్పటికప్పుడు వాటిని తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అనసూయ పుష్ప సినిమాలు దాక్షాయినిగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమాతో ఇక వరుసగా సినీ ఆఫర్లు అందుకుంటూ వస్తుంది.