Ibomma : డిస్ట్రిబ్యూటర్లకు ప్రొడ్యూసర్లకు ఐ బొమ్మ వార్నింగ్…మాపై ఫోకస్ చేస్తే మేము ఎక్కడ చేయాలో అక్కడ చేస్తాం…

Ibomma  : పేదోడి ఓటిటి ప్లాట్ ఫాంగా పిలవబడే ఐ బొమ్మ సినీ ఇండస్ట్రీకి పెద్ద వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల ఐ బొమ్మలో కొత్త సినిమాలను కూడా అప్లోడ్ చేస్తున్నారు. అంతకుముందు చూసుకుంటే కొత్త సినిమాలు ఓటిటీ లోకి రాగానే హెచ్డి క్వాలిటీ ప్రింట్ ను ఐ బొమ్మలో పెట్టేవారు. దీంతో చాలామంది ఎలాంటి ప్రీమియం చెల్లింపులు లేకుండా ఉచితంగా కొత్త సినిమాలను చూసేవారు. హెచ్డి సినిమాలు ఐ బొమ్మల లభించడంతో చాలామంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ వైపు వెళ్లేందుకు మోగ్గుచూపడం లేదు. దీంతో ఐ బొమ్మ తెలుగు సినీ ఇండస్ట్రీకి మరియు ఓటిటీ ప్లాట్ ఫామ్స్ కు పెద్ద దెబ్బగా మారింది.

Advertisement

i-bomma-warning-to-producers-to-distributors

Advertisement

అయితే ఇప్పుడు ఏకంగా కొత్త సినిమాలు కూడా ఐ బొమ్మ తన వెబ్ సైట్ లో పెట్టేస్తుంది. దీంతో కొత్త సినిమాల వసూళ్లపై దెబ్బ పడనుంది. ఇప్పటికే ఖుషి , జైలర్ వంటి సినిమాలను మంచి క్వాలిటీతో ఐ బొమ్మ తన వెబ్ సైట్ లో పెట్టింది. దీంతో చాలామంది ఈ సినిమాలను చూసేశారు. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఐ బొమ్మ పై కన్నెర్ర చేసింది. పలువురు నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు ఐ బొమ్మ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఐ బొమ్మ ఇండస్ట్రీకి మరియు డిస్ట్రిబ్యూటర్లకు ఊహించని విధంగా వార్నింగ్ ఇచ్చింది. మీరు మా ఐ బొమ్మ మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తామని చెప్పింది.

i-bomma-warning-to-producers-to-distributors

డిస్ట్రిబ్యూటర్లకు రైట్స్ అమ్మిన తర్వాత ఏం పట్టనట్లు మీరు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ల మీద కాకుండా ఓటిటి రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెడుతున్నారని చెప్పింది. ఇక హీరోలకు ఇస్తున్న రెమ్యూనరేషన్ లు , సినిమా బడ్జెట్ లు , చాలా ఉంటున్నాయని సినిమా కోసం కష్టపడుతున్న ప్రొడక్షన్ బాయ్స్ కి , లైటింగ్ బాయ్స్ కి మీరు ఎంత ఇస్తున్నారు అంటూ ఐ బొమ్మ ప్రశ్నించింది. ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది. అనవసర బడ్జెట్ పెట్టి దానిని ప్రజల మీద రుద్ది మధ్యతరగతుల వారి జేబులను ఖాళీ చేస్తున్నారని ఐ బొమ్మ తీవ్రంగా విరుచుపడింది. దీంతో ఐ బొమ్మ పెట్టిన ఈ మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ మెసేజ్ కు సినీ ఇండస్ట్రీ మరియు ప్రొడ్యూసర్లు ఎలా సమాధానం ఇస్తారో వేచి చూడాలి.

Advertisement