vishal varalakshmi : 7 సంవత్సరాల సీక్రెట్ రిలేషన్ లో విశాల్ – వరలక్ష్మి…మరి ఎందుకు విడిపోయారు..?

vishal varalakshmi  : కోలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ అయిన వరలక్ష్మి శరత్ కుమార్ మరియు హీరో విశాల్ ఒకప్పుడు గాఢంగా ప్రేమించుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దాదాపు ఏడు సంవత్సరాల పాటు ప్రేమాయనం నడిపించిన వీరు ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. ఇక వీరి బ్రేకప్ కు కారణం ఏంటి అనే విషయాలు ఇప్పటికీ ఎవరికీ తెలియదు. దీనిపై ఇప్పటికే ఎన్నో కారణాలు వినిపించినప్పటికీ దాంట్లో ఒకటి కూడా స్పష్టం కాలేదు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణం వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ అని కొందరు అంటుంటే మరి కొందరు వేరే కారణాలు ఉంనాయని చెబుతున్నారు. అయితే తాజాగా వీరి బ్రేకప్ పై మరో వార్త వైరల్ గా మారింది.

Advertisement

vishal-varalakshmi-in-a-relationship-of-7-years-and-why-did-they-break-up

Advertisement

మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వరలక్ష్మి శరత్ కుమార్ మరియు విశాల్ మొదట మదగజ రాజా అనే సినిమా లో నటించి అప్పుడే ప్రేమలో పడ్డారు. అంతేకాక వీరిద్దరి జోడి చూడముచ్చటగా ఉండడంతో ఈ జంటకు అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి ప్రేమాయణం కొలివుడ్ లో చాలా వైరల్ అయింది.  అయితే వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నప్పుడు 2019లో ఆర్టిస్ట్ ఎలక్షన్స్ లో భాగంగా శరత్ కుమార్ కి పోటీగా విశాల్ నిలబడడం జరిగింది. ఇక ఆ సందర్భంలో వరలక్ష్మి కూడా విశాల్ కే మద్దతుతెలిపిందట. ఈ క్రమంలోనే విశాల్ శరత్ కుమార్ పై విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో విశాల్ చేతిలో ఓడిపోయిన శరత్ కుమార్ తన కూతుర్ని విశాల్ కు ఇచ్చి పెళ్లి చేసేందుకు ఒప్పుకోలేదట.

vishal-varalakshmi-in-a-relationship-of-7-years-and-why-did-they-break-up

అందుకే వారిద్దరు విడిపోయినట్లుగా అప్పట్లో వార్తలు ప్రచారం జరిగింది. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తాజాగా కొందరు తెలియజేస్తున్నారు. ఇక వీరిద్దరు విడిపోవడానికి గల ముఖ్య కారణం వరలక్ష్మి శరత్ కుమార్ అని తెలియజేస్తున్నారు. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ ఒకవైపు విశాల్ తో ప్రేమాయణం నడిపిస్తూనే మరోవైపు తమిళ్ హీరో సంతోష్ ప్రతాప్ తో సీక్రెట్ రిలేషన్షిప్ కొనసాగించారట. ఇక ఆ విషయం కాస్త బయటకు రాగానే విశాల్ వరలక్ష్మీ ని దూరం పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా ఏడు సంవత్సరాల వీరి రిలేషన్ కి ఒక్కసారిగా పులిస్టాప్ పడింది. అయితే ఇప్పటికి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వరలక్ష్మి మరియు విశాల్ ఇద్దరు కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే జీవితాన్ని గడుపుతున్నారు.

Advertisement