Eating Rats : ఎలుకలే ఆహారం…ఎలుకలే జీవనాధారం…ఈ వ్యక్తి గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Eating Rats : ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం పద్ధతులు ఉంటాయి. అదేవిధంగా వారి ఆహారపు అలవాట్లు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్ని దేశాల వారు తీసుకునే ఆహారం చూస్తే మనం నూరేళ్ల పెట్టక తప్పదు. ఇక అలాంటివారిలో చైనీస్ వారు ఒకరని చెప్పాలి. వీరు వారి ఆహారంగా పక్షులను జంతువులను పాములను అన్నింటినీ తినేస్తారు. అయితే వీరిలో ఎలకలను కూడా వదలకుండా తినేవారు కూడా ఉన్నారు. మన వద్ద మిరపకాయ బజ్జీ చేసినట్లుగా వారు ఎలకలను డీప్ ఫ్రై చేసుకుని తింటున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి .

Advertisement

తక్కువ ఖర్చుతో ఎలుకల నిర్మూలన - V.E.R Agro Farms

Advertisement

ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే ఎవర్రా మీరంతా అనక మానరు. అయితే ఎవరి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఆహారాన్ని గౌరవించాలి.  ఎలాంటి ఆహారమైన చీ..తూ..అని అనకూడదంటూ మన పెద్దలు చెబుతుంటారు. కానీ కొన్ని విచిత్రమైన ఆహార పదార్థాలను చూసినప్పుడు ఇలాంటి పదాలు అనకుండా ఉండలేము. అయితే ప్రతి గ్రామంలో ఎలుకలు అనేవి చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉంటాయి. ఇంట్లో ఉండే అన్నం ధాన్యం బట్టలు మరియు ఇతర వస్తువులను పాడుచేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే మన ప్రాంతాలలో వాటిని పట్టుకునేందుకు బోనులను తయారు చేసి వాటిని చంపి పడేస్తున్నారు.  కానీ ఓ ప్రాంతానికి చెందిన ప్రజలకు మాత్రం ఎలుకలు గొప్ప ఆహారం.

ఈ క్రమంలోనే అక్కడి ప్రజలు ఎలుకలను పట్టుకుని వేయించుకుని తింటున్నారు. వినడానికి కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ ఇదే వాస్తవం. ఇక ఇది ఎక్కడో వేరే దేశంలో అనుకోకండి. మనదేశంలోని మన తెలుగు వారు కూడా చాలామంది ఎలుకలను తింటున్నారు. ఆంధ్రప్రదేశ్ చెందిన గుంటూరు జిల్లాలోని ఒక ప్రాంతంలో ఏళ్ళ తరబడి ఓ ఎలుకలను తింటూ వాటి మీదనే జీవనం కొనసాగిస్తూ వస్తున్నారు. ఇతని గురించి పూర్తి వివరాలను ఇటీవల సుమన్ టీవీ ఛానల్ వారు ఇంటర్వ్యూ చేసి తెలియజేశారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ వివరాలు ఏంటో మీరు కూడా చూసేయండి.

Advertisement