Abijeet : అభిజీత్ పేరు తెలియని వాళ్లు ఉండరు తెలుగు ప్రేక్షకుల్లో. ముఖ్యంగా బిగ్ బాస్ అభిమానులకు అయితే అభిజీత్ గురించి ఇంకాస్త ఎక్కువ తెలుసు. బిగ్ బాస్ 4 తెలుగు విన్నర్ టైటిల్ గెలుచుకున్నాక అభిజీత్ చాలా సినిమాలు చేస్తాడని అనుకున్నారు. పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేసి స్టార్ హీరోగా ఎదుగుతాడు అనుకున్నారు కానీ.. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యాక అసలు అభిజీత్ ఎక్కడికి వెళ్లాడో ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరికీ కనిపించకుండా వెళ్లిపోయాడు. మీడియా కంట కూడా పడలేదు. చివరకు తాజాగా మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. జులై 8న అమెజాన్ ప్రైమ్ లో మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయింది.
ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం అభిజీత్ తాజాగా మీడియా ముందుకు వచ్చారు. అయితే.. ఇన్ని రోజులు ఎందుకు సినిమా చేయకుండా అభిజీత్ దూరంగా ఉన్నాడు.. అభిమానులకు దూరంగా ఎందుకు ఉన్నాడు? తాజాగా వెబ్ సిరీస్ లో ఎందుకు నటించాడు అనే విషయాలను మీడియా ముందు వెల్లడించాడు అభిజీత్.
Abijeet : నేను చాలా ప్రైవేట్ వ్యక్తిని
నేను ఫ్యాన్స్ తో ఎప్పటికీ ఇంటరాక్ట్ అయ్యాను. కానీ.. నాకు కొంచెం పీస్ ఫుల్ గా ఉండాలని ఉంటుంది. మీడియాకు దూరంగా ఉంటాను. నేను ప్రైవేట్ పర్సన్ ను అని అభిజీత్ చెప్పాడు. మరి.. మీరు ఇన్నాళ్లు ఎందుకు సినిమాలు చేయలేదు అంటే.. తనకు ఇప్పటి వరకు విన్న ఏ స్టోరీ నచ్చలేదని.. తనకు స్టోరీ నచ్చకపోతే అస్సలు సినిమా చేయనని.. వాళ్లు ఎంత పెద్ద డైరెక్టర్లు అయినా కూడా తాను సినిమా చేయను అని చెప్పాడు అభిజీత్.
తనకు మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే సినిమా స్టోరీ నచ్చడంతో ఈ సినిమా చేశానని అభిజీత్ చెప్పాడు. వెబ్ సిరీస్ అయినా సినిమా అయినా.. స్టోరీ బాగుంటే.. సినిమా బాగుంటే ఖచ్చితంగా అభిమానులు ఆదరిస్తారని అభిజీత్ చెప్పుకొచ్చాడు.