Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరలో నెంబర్ వన్ కామెడీ షో గా వెలుగుతున్న జబర్దస్త్ కి ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా చేసింది. ఒకపక్క యాంకర్ గా చేస్తూనే మరో ప్రక్క సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు సినిమాలలో ఛాన్సెస్ ఎక్కువగా రావడం వలన జబర్దస్త్ వీడినట్లు చెప్పుకొచ్చింది అనసూయ. అలాగే అనసూయ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ లు పెడుతూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువగా వివాదాస్పద గొడవల్లోకి దూరుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా అనసూయ ఓ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుంది. దానికి కారణం విజయ్ దేవరకొండ అభిమానులు అన్న సంగతి తెలిసిందే.
లైగర్ సినిమా రిలీజ్ రోజు అనసూయ పరోక్షంగా విజయ్ ని విమర్శిస్తూ ట్వీట్ చేయడం హార్ట్ టాపిక్ గా మారిపోయింది. రౌడీ స్టార్ ఫ్యాన్స్ ఆమెను ఆంటీ ఆంటీ ఆంటీ అంటూ ట్రోల్ చేయడం గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే అనసూయ కూడా ట్రోలర్స్ కి గట్టిగా కౌంటర్ ఇస్తూనే వచ్చింది. అంతేకాదు ఏకంగా తనను ఆంటీ అంటూ ట్వీట్ చేసే వాళ్లపై పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసింది. అయితే అనసూయ కి పరోక్షంగా కౌంటర్ ఇస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ మరోసారి కొత్త వివాదానికి తెర లేపాడు. ఆయనను ఓ నెటిజన్ అంకుల్ అన్నాడు. దీంతో బ్రహ్మాజీ కోప్పడుతు అంకుల్ ఏంట్రా అంకుల్ బాడీ షేమింగ్ కేసు వేస్తా జాగ్రత్త అంటూ రిప్లై ఇచ్చాడు.
Anasuya : బ్రహ్మాజీ విషయంలో సైలెంట్ గా ఉన్న అనసూయ…

దీంతో అందరూ ఇది అనసూయ కి కౌంటర్ అంటూ పెద్ద ఇష్యుగా మార్చేశారు. అయితే చిన్న మాట అంటేనే తట్టుకోలేని అనసూయ బ్రహ్మాజీ అంత పెద్ద కామెంట్స్ చేసిన సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటా అని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. గతంలో ఓ రిపోర్టర్ తన వయసు ఎక్కువ రాసిందని క్లారిటీ ఇస్తూ అనసూయ ఆ ఆర్టికల్ని ట్యాగ్ చేస్తూ పెద్ద క్లాసే పీకింది. మరి అలాంటి అనసూయ బ్రహ్మాజీ కామెంట్స్ కనిపించట్లేదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు అనసూయ కి బ్రహ్మాజీ కి ఒక రకమైన ఫ్రెండ్షిప్ ఉందిలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అనసూయ బ్రహ్మాజీ మధ్య ఏ రిలేషన్ ఉందో అంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మరి చూడాలి అనసూయ ఎటువంటి రిప్లై ఇస్తుందో.