Health Benfits : సాధారణంగా బరువు తగ్గాలంటే స్వీట్స్ ను తక్కువగా తినాలి. కానీ మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే ఈ స్వీట్ ను తినండి అని ఎందుకు అంటున్నారు అని ఈ స్వీట్ ను తింటే నిజంగానే బరువు తగ్గుతారు. ఇంతకు ఆ స్వీట్ ఏంటి ఇ అనుకుంటున్నారా. అదే సాబుదాన బర్ఫీ స్వీట్. దీనిని ఎండాకాలంలో ఎక్కువగా తింటారు. ఇది వాంతులు-విరేచనాలు, నీరసం వంటి వాటిని నయం చేయటానికి ఉపయోగపడుతుంది. అలాగే స్వీట్ మన శరీరంలోని అధిక బరువును తగ్గిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సాబుదాన బర్ఫీ స్వీటు ను ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. ఒక కప్పు సాబుదాన, ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వ, రెండు స్పూన్ల జీడిపప్పు ముక్కలు, రెండు స్పూన్ల బాదం పప్పు ముక్కలు, ఒక స్పూన్ యాలకుల పొడి, రుచికి సరిపడా తేనే, కొంచెం మీగడ, ఒక కప్పు పాలు.
తయారి విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ పెనం పెట్టి రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి. అందులో జీడిపప్పు, బాదం పప్పు వేయించి ప్రక్కన పెట్టుకోవాలి. తరువాత అందులోనే సాబుదాన,గోధుమ రవ్వను కూడా వేసుకుని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి. వీటిని మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి లాగా పట్టుకోవాలి. తరువాత మళ్లీ స్టవ్ ఆన్ చేసి పెనంలో ఈ పొడిని వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత పాలు కొంచెం కొంచెం గా పోసుకుంటూ వాటిని ఉండలు కట్టకుండా బాగా కలపాలి. తరువాత కొద్దిగా తేనె వేసి ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం పెనంకు అంటుకోకుండా ముద్దలా అయ్యేంతవరకు బాగా కలపాలి.
Health Benfits : బరువు తగ్గాలనుకుంటున్నారా… అయితే ఈ స్వీట్ ను తినండి

తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదంపప్పు ముక్కలను వేసి బాగా కలపాలి. ఒక స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత దానిని ఒక కాగితం మీద మీగడ రాసి సాబుదాన బర్ఫీ మిశ్రమాన్ని వేసి చిన్నచిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత తింటే ఎంతో రుచిగా ఉంటుంది. దీనిలో తక్కువ కేలరీలు ఇంగ్రిడియంట్స్ ఉంటాయి. కనుక ఆరోగ్యానికి మంచిది. అదే విధంగా బరువు కూడా తగ్గవచ్చు.