Inspirational Story : రాజమౌళి ఈగతో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఖమ్మం కుర్రాడు…

Inspirational Story : ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో మైక్రో ఆర్టిస్ట్ గౌరీ శంకర్ అనే యువకుడు అంటే తెలియని వారు ఉండరు కాబోలు. వయసులో చాలా చిన్నవాడు అయినప్పటికీ తన లక్ష్యాన్ని మాత్రం చాలా ప్రత్యేకంగా ఉండేలా ఎంచుకున్నాడు. అందరికంటే ప్రత్యేకంగా ఉండాలనే తన ఆలోచన తనలోని టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే రాజమౌళి ఈగకు ఇతనికి సంబంధం ఏంటి అంటే …ఈ యువకుడు హై స్కూల్ లో చదువుకునే రోజుల్లో మన దర్శకుడు రాజమౌళి గ్రాఫిక్స్ సహాయంతో ఈగ సినిమాను తీయడంజరిగింది. ఈ సినిమాను చూసిన గౌరీ శంకర్ ,తన లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాడు . ఈ సినిమాలోని ఈగ గౌరీ శంకర్ లో దాగి ఉన్న మైక్రో ఆర్టిస్ట్ కోణాన్ని ప్రపంచానికి పరిచయం అయ్యేలా చేసింది.

Advertisement

rajamoulis-khammam-boy-holds-two-guinness-world-records-with-his-fly

Advertisement

ఈ క్రమంలోనే గౌరీ శంకర్ బ్రహ్మజెముడు మొక్క ముళ్ళు తో అత్యంత చిన్నదైనా టేబుల్ స్పూన్ తయారుచేసి చీమ చేతికి అందించాడు . చీమలు వాటి చేతులతో పట్టుకుని అంత వీలుగా దీనిని తయారు చేయడంతో ప్రపంచ గిన్నిస్ రికార్డ్ సాధించాడు. అంతేకాక మరో 60 రోజుల్లోనే మరో రికార్డు కూడా సాధించి హ్యాట్రిక్ కోసం కష్టపడుతున్నారు. అయితే గౌరీ శంకర్ రాజమౌళి ఈగ సినిమా చూసి ఆ సినిమాలో హీరో నాని కోసం హీరోయిన్ సమంత పెన్సిల్ మొన పై హాట్ సింబల్ డిజైన్ చేసి ఇచ్చిన సన్నివేశాన్ని ఆధారంగా చేసుకొని తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలియజేశారు. అయితే రాజమౌళి ఈగ సినిమాతో మైక్రో ఆర్టిస్ట్ గా మారిన గౌరీ శంకర్ ఇప్పటికే రెండుసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నాడు

rajamoulis-khammam-boy-holds-two-guinness-world-records-with-his-fly

అయితే గౌరీ శంకర్ చాలా పేద కుటుంబానికి చెందిన వాడవడంతో ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడంతో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతున్నానని తెలియజేశారు. అయితే అతనికి పోలీసు అధికారి ఎస్పీ వెంకటేష్ కాస్త అండగా నిలబడటం వలన రెండుసార్లు ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించినట్లు తెలియజేశారు. ఇంకా ఎవరైనా ఆర్థికంగా అతనికి సహాయం చేసినట్లయితే మరో రెండు మూడు నెలల్లో మరో ప్రపంచ గిన్నిస్ రికార్డు తీసుకొస్తా అంటూ తెలియజేశాడు .ఏది ఏమైనాప్పటికీ ఇలాంటి రోజుల్లో తనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని తన లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఈ యువకుడు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని చెప్పాలి.

అలాంటి తనకు ఒక పోలీస్ అధికారి ఎసిపి వెంకటేష్ వెన్ను దన్నుగా నిలవడమే కాకుండా సహాయక సహకారాలు అందించడం తో ఇప్పటికీ రెండు సార్లు ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డు సాధించగలిగాను అని గౌరి శంకర్ తెలిపాడు. ఇంకా ఎవ్వరైనా ఆర్థికంగా కొంత సహాయం అందిస్తే రెండు నెలల్లో మూడో సారి మరో ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది చూపిస్తాను అని చెప్పుకొచ్చాడు.

గౌరి శంకర్ చాలా పేద కుటుంబానికి చెందిన వాడు. తనకు చిన్న తనం నుంచి ప్రత్యేకంగా కనపడటం ఇష్టం. చిన్న చిన్న వాటిని పెద్దగా చుపించెలా ఫోటోలు తీసేవాడు. ఆర్థిక స్థోమత లేకపోవడం తో తాను అనుకున్న లక్ష్యాలను అందుకోలేక పోతున్నాను అంటున్నాడు

Advertisement