కాంగ్రెస్ లోకి ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి..?

తెలంగాణలో కాంగ్రెస్ శరవేగంగా పుంజుకుంటుంది. మునుపెన్నడూ లేని విధంగా వలసలు కొనసాగుతున్నాయి. ఇదివరకు బీజేపీ, బీఆర్ఎస్ లోకి మాత్రమే కొనసాగిన చేరికలు ఇప్పుడు ఆ రెండుపార్టీల్లో చేరేవారు తగ్గిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ లోకి మాత్రమే చేరికలు నడుస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ రేసులోకి వచ్చేసింది.

Advertisement

ఇటీవలే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావులు ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత, బాల్కొండ నేత సునీల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు.

Advertisement

మంగళవారం ఢిల్లీలో రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలతో సునీల్ రెడ్డి చర్చలు జరిపినట్లు సమాచారం. 2018ముందస్తు ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన సునీల్ రెడ్డి బీఎస్పీ నుంచి బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టించి రెండో స్థానంలో నిలిచారు సునీల్ రెడ్డి.

ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకోవడంతో వేములకు ధీటైన అభ్యర్థి దొరికినట్లేనని నిజామాబాద్ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement