Viral Video : పబ్ లో ఒక వ్యక్తి పై మహిళలు పిడిగుద్దులు. వైరల్ అయిన వీడియో…

Viral Video : ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని అన్‌ప్లగ్డ్ కేఫ్ వెలుపల మద్యం మత్తులో ఉన్న ఇద్దరు మహిళలు ఇటీవల అర్థరాత్రి ఓ వ్యక్తిని కొట్టడం కెమెరాకు చిక్కింది. భవనంలోని 15వ అంతస్తులో ఉన్న పబ్ వెలుపల ఒక యువతి ఒక వ్యక్తి పై పిడిగుద్దులు గుద్దుతూ ఉన్న వీడియో వైరల్ అయ్యింది. ప్రజలు తమ ఫోన్‌లలో గొడవను రికార్డ్ చేయడంతో ఆమె ఆ వ్యక్తిని కొట్టడం చూడవచ్చు.

పబ్ ప్రవేశ ద్వారం వద్ద ఉంచిన పూల కుండీతో కూడా సదరు వ్యక్తిపై మహిళ దాడి చేసింది. ఈ సంఘటన విభూతి ఖండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమ్మిట్ బిల్డింగ్‌లో గురువారం చోటుచేసుకుంది. పబ్‌లోని బౌన్సర్లు మరియు ఇతర నిర్వాహకులు అడ్డుకునే ముందు కొద్దిసేపు గొడవ కొనసాగింది.

Viral Video : పబ్ లో ఒక వ్యక్తి పై మహిళలు పిడిగుద్దులు

young girls attacked person in pub video gone viral
young girls attacked person in pub video gone viral

వీడియోలో ఉన్న ఇద్దరు మహిళలను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు, అయితే వీరి తో దెబ్బలు తిన్న వ్యక్తి వారిపై ఫిర్యాదు చేయడానికి రాలేదు.