Kidney stones : ప్రస్తుతం మన జీవిస్తున్న జీవనశైలి విధానంలో చాలామందికి కిడ్నీలలో రాళ్లు వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మన బాడీలో అత్యంత ప్రధానమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. ఇవి బ్లడ్ లో చెడు టాక్సిన్ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి మూత్రం రూపంలో బయటికి నెట్టి వేస్తుంది. మూత్రపిండాలు పనితీరు సవ్యంగా ఉంటేనే మిగతావి వాళ్ళు మంచిగా పనిచేస్తాయి. లేకపోతే అవయవాలు పనిచేయడం ఆగిపోయి మనిషి ప్రాణాలకే ప్రమాదం కలుగుతుంది. బాడీలో చెడు ట్యాక్సీలను ఫిల్టర్ చేయడంలో మూత్రపిండాలకు కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. అందులో ప్రధానంగా తెలియజేయాల్సింది. మూత్రపిండాలలో స్టోన్స్ ఇప్పుడున్న కాలంలో కొన్ని ఆహారపు మార్పులు వలన చాలామందికి ఈ మూత్రపిండాల్లో స్టోన్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
మూత్రపిండాలలో స్టోన్స్ ఎలా ఏర్పడతాయి..?
మూత్రంలో లిక్విడ్ సాలిడ్ కాంపోనెంట్స్ రెండు ఉంటాయి. సాలిడ్ కంపోనెంట్లో పొటాషియం, యూరిక్ యాసిడ్, కాల్షియం, సోడియం తో పాటు వివిధ రకాల పదార్థాలు ఉంటాయి. సాలిడ్ కంపోనెంట్లు మూత్రంలో కరగకుండా ఉంటే అవి చిన్న చిన్న రాళ్లుగా మారుతాయి. నీళ్లు ఎక్కువ తీసుకో పోయేసరికి అవి ఇంకాస్త పెద్దగా అవుతూ ఉంటాయి. అప్పుడు అవి బఠానీ సైజు అంత అవ్వడం మూలంగా ఏర్పడే స్టోన్స్ ఎక్కువగా బయటపడుతుంటాయి.
Kidney stones : మూత్రపిండాలలో స్టోన్స్ ఉన్నాయా.. మొక్కజొన్న పీస్ తో బయటికి వచ్చేస్తాయట…

దీని లక్షణాలు ఎలా ఉంటాయి…
మూత్రపిండాలలో రాళ్లు వచ్చినప్పుడు మనిషి బరువు కోల్పోవడం పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పితో పాటు యూరిన్ కి వెళ్లడం కష్టమవుతుంది. యూర్న్ కి వెళ్లే సమయంలో నొప్పి, మంట వస్తుంది.
వాటర్ ని అధికంగా తీసుకోండి..
నీటిని శరీరానికి సరిపోయేంత త్రాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. వాటర్ హైడ్రిస్ ఇన్ లెవెల్స్ ను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. నీరు మూత్రపిండాలలో మినరల్స్, పోషకాలను కరిగించడానికి ఉపయోగపడుతుంది. అలాగే కిడ్నీలకు హాని చేసే ట్యాక్సీను బయటికి నెట్టేయడంలో నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది. 5 ఎంఎం స్టోన్ మూత్రపిండాలు, నాలంలో ఉంటే 3,4 లీటర్ల వాటర్ ని తీసుకున్నట్లయితే వాటిని బయటికి నెట్టి వేయడానికి 50 శాతం అవకాశం ఉంది. అదేవిధంగా నిత్యము రెండు లీటర్ల మూత్రం తయారు చేయగలిగితే 90% స్టోన్స్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.
అంటే నిత్యము 4 లీటర్ల వాటన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
స్టోన్స్ అసలు ఎందుకు వస్తాయి..
ఇలా స్టోన్స్ రావడానికి కారణం వాటర్ ని సరిగా తీసుకోకపోవడం, శరీరానికి సరియైన శ్రమ లేకపోవడం, షుగర్ సమస్య ఉన్నవారికి, ఈ స్టోన్ సమస్య వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే మాంసాహారాలను ఎక్కువగా తీసుకున్న భోజనం ఆలస్యంగా చేసిన సరియైన నిద్ర లేకపోయినా ఈ విధంగా రాళ్లు రావచ్చు.
మొక్కజొన్న పీచుతో స్టోన్స్ తొలగింపు…
అయితే మొక్కజొన్న పీచును పడేస్తూ ఉంటాం. అయితే ఈ పీచు మూత్రపిండాలలో స్టోన్స్ ను బయటికి పంపించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మొక్కజొన్న పీచు నీటిలో మరగబెట్టి తర్వాత వడకట్టి ఈ నీటిని తీసుకున్నట్లయితే మూత్రపిండాలలో స్టోన్స్ తొందరగా బయటికి పోతాయి. అలాగే ఈ పీచు వలన మూత్రపిండాలలో రాళ్ల వల్ల వచ్చే నొప్పిని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఈ నీరు మూత్ర ప్రవాహాన్ని అధికం చేసి అసలు ఈ సమస్య రాకుండా రక్షిస్తుంది.
అలాగే దానిమ్మ రసం..
జాతీయ మూత్రపిండాల ఫౌండేషన్ విధానంగా, దానిమ్మలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఈ జ్యూస్ బాడీని హైడ్రేట్ గా ఉంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ నాచురల్ గా మూత్రపిండాలలో స్టోన్స్ ని బయటికి పంపించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్;
ఈ సైడర్ వెనిగర్ లో యాసిడ్ దాగి ఉంటుంది. ఇది మూత్రపిండాలలో స్టోన్స్ ని చిన్నచిన్న ముక్కలుగా చేసి కరిగిపోయేలా చేస్తుంది. ఇది మూత్ర నాళ్ళం గుండా మూత్రపిండాలలో స్టోన్స్ ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఇది రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ గోరువెచ్చని నీటితో కలిపి తీసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
ఆలివ్ ఆయిల్, నిమ్మరసం:
నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కాంబినేషన్ కొద్దిగా వెరైటీ గానే ఉంటుంది. ఇవి మూత్రపిండాలలో స్టోన్స్ ని తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. అని హర్వార్డ్ హెల్త్ నివేదిక పేర్కొంది. ఈ సమస్య తగ్గేవరకు ఈ విధంగా దీనిని సేవించినట్లయితే రాళ్లనే తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆలివ్ ఆయిల్ ఎటువంటి సమస్య లేకుండా కిడ్నీ నుండి రాళ్లు వెళ్లడానికి చాలా బాగా పనిచేస్తుంది.