Viral Video : ఇది కలా నిజమా… అసలు 61 ఏళ్ల వృద్ధుడు.. యువతిని పెళ్లి చేసుకోవడం ఏంటి.. అది కూడా 28 ఏళ్ల వయసు ఉన్న యువతిని అని ఆశ్చర్యపోతున్నారా.. మీరు ఆశ్చర్యపోయినా.. ఆశ్చర్యపోకున్నా ఇదే నిజం. అయితే.. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయింపబడతాయి అంటారు కదా.. తాజాగా అదే జరిగినట్టుంది. వీళ్ల పెళ్లి కూడా స్వర్గంలోనే నిశ్చయించబడినట్టుంది. అందుకే.. 61 ఏళ్ల వయసు ఉన్నా కూడా ఆ తాతకు యువతితో పెళ్లి అయింది. షష్ఠి పూర్తి చేసుకోవాల్సిన వయసులో తాత ఏకంగా యువతితో పెళ్లికి రెడీ అయిపోయాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలు ఆ వృద్ధుడు ఈ వయసులో ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అది కూడా 28 ఏళ్ల యువతిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు. ఆ యువతి అయినా ఎలా ఆ యువకుడితో పెళ్లికి ఒప్పుకుంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం రండి. నిజానికి.. తమిళనాడుకు చెందిన ఆ వ్యక్తి ఫ్రాన్స్ లో ఉంటాడట. పుదుచ్చేరిలో ఉన్న తన బంధువుల ఇంటికి ఇటీవల వచ్చాడట. అప్పుడు తన బంధువులతో తన బాధను చెప్పుకున్నాడట.
Viral Video : వృద్ధుడిని చేసుకోవడానికి ఒప్పుకున్న యువతి
దీంతో తన బంధువులు.. అతడి కోసం సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. దీంతో పుదుచ్చేరిలోనే ఉంటున్న ఓ యువతి అతడిని చేసుకోవడానికి ఓకే చెప్పేసింది. ఆ యువతి ఒప్పేసుకున్నాక ఇక లేట్ ఏముంటుంది చెప్పండి. వెంనే పుదుచ్చేరిలోనే మనక్కుల వినాయగర్ గుడిలో కొంతమంది బంధువుల సమక్షంలో వాళ్ల పెళ్లి జరిగిపోయింది. కొన్ని రోజులు పుదుచ్చేరిలోనే ఉండి.. ఆ తర్వాత ఫ్రాన్స్ కు కొత్త భార్యతో వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు ఆ వృద్ధుడు. అయితే.. ఆ యువతికి ఇప్పటికే పెళ్లి అయి భర్త మరణించాడట. తన భర్త మరణించడంతో ఒంటరిగా ఉంటున్న ఆ యువతి అతడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందట. అంతే కాదు.. రివర్స్ లో ఆ వృద్ధుడు.. పెళ్లి కూతురు కుటుంబానికి రూ.2.5 కోట్ల రూపాయలు కట్నంగా ఇచ్చాడట. అందుకే ఆ యువతి అతడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందని వార్తలు పుదుచ్చేరిలో గుప్పుమంటున్నాయి. ఏది ఏమైనా.. వాళ్ల పెళ్లి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
எனக்கு கொஞ்சம் விஷம் வாங்கி கொடுங்களேன்..???????? pic.twitter.com/kVHWtUkISj
— கல்கி குமார் (@kalgikumaru) August 30, 2022