అమ్మాయిలు ఆ మూడు రోజులు ఏం తినాలో తెలుసా?

ఆడవాళ్ళు రజస్వల అవ్వడం ప్రకృతి సహజం. ఆ మూడు రోజులు ఆడవాళ్ళు మాములుగా ఉంటే వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. చిరాకుగా ఉంటే మానసిక ఒత్తిడిలో ఉన్నారని అర్థం. నీరసంగా ఉన్నారంటే బలహీనంగా ఉన్నారని అర్థం. అదే విపరీతమైన కడుపునొప్పితో ఉన్నారంటే కడుపులో ఏదో లోపం ఉన్నదని అర్థం.

Advertisement

అంటే ఆడవాళ్ళు తగిన పోషక ఆహారం తీసుకోలేదని అర్థం. ఈ లోపాన్ని జయించడానికి మందులు వాడితే అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. కానీ సరైన పౌష్టిక ఆహరం తీసుకుంటే జీవితాంతం పరిష్కారం దొరుకుతుంది. ఆ కడుపు నొప్పి దరిదాపుల్లోకి రాదు అని ప్రముఖ సీనియర్‌ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ పి. బాలాంబ చెప్పారు.

Advertisement

ఈ మూడు రోజలు ఆడవాళ్ళు ఎలంటి పనులు చేయకుడా విశ్రాంతి తీసుకోవాలి. అందుకే మన పెద్దలు అమ్మాయిలు రజస్వల కాగానే చాప వేసి ఓ మూలకు కూర్చో పెడతారు. రజస్వల సమయంలో వంట గదిలోకి వెళ్లరాదని, వంట చేయరాదని, పూజ చేయరాదని, గడప దాటరాదని, గుడికి వెళ్లరాదని, శుభ కార్యాలయాలకు వెళ్లరాదని, ఆడుకోవద్దని చెపుతారు. అంటే దానివలన కొంపలు అంటుకుంటాయి అని కాదు. ఆ మూడు రోజులు ఆడవాళ్ళకు సంపూర్ణంగా విశ్రాంతి ఇవ్వాలని సెంటి మెంట్ అంటగడతారు. అందుకే పాతకాలం ఆడవాళ్ళు ఎంతో బలంగా ఉన్దేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఈ మూడు రోజులు ఆడవాళ్ళు గుడికి వెళ్ళడం మినహా అన్ని పనులు చేస్తున్నారు. అక్కడే బలహీనతకు లోనవుతున్నారు.

ఆడవాళ్ళు రజస్వల అయినప్పుడు కారం తింటే కడుపులో నొప్పి వస్తుందన్న మాటలో ఎలాంటి శాస్త్రీయతా లేదు. కానీ ఈ దశలో ఆడపిల్లలకు కారం లేని ఆహరం చాలా ఉపశమనం దొరుకుతుంది. ఈ సమయంలో మంచి పౌష్టికాహారం చాలా అవసరం. పెరుగు అన్నం ఉత్తమం. రక్తహీనత, ఎముకల బలహీనత లాంటి సమస్యలు తలెత్తే సమయమిది. అందుకే క్యాల్షియం, ఐరన్‌, విటమిన్‌-డి అధికంగా లభించే ఆహారాలు కడుపునిండా తినాలి. డైటింగ్ పేరుతో సగం కడుపు మార్చ కూడదు. కావాలంటే ఆ మూడు రోజుల తర్వాత డైటింగ్ చేయవచ్చు. రజస్వల అయిన ఆడపిల్లలకు నువ్వుల ముద్ద పెడతాం. ఇది మంచిదే. నువ్వుల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. మన పెద్దలు చేసే పిండి వంటకాలు, మలీద ముద్దలు, అరిసెలు, ఎండు కొబ్బరి, బెల్లం సున్ని ఉండలు, గరిజెలు, చెనెగ మురుకులు, గుడాలు, కుసుమాలు, చెక్కర పొంగలి, దద్దోజనం లాంటి వంటకాలలో క్యాల్షియం, ఐరన్‌, విటమిన్‌-డి పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని మాత్రమే ఆరు నెలలపాటు అమ్మాయిలకు విధిగా పెడతారు.

ఎందుకంటే అమ్మాయి రజస్వల అయ్యాక తొలి ఆరు నెలలు ఇలాంటి సమతులాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే వీళ్లు పొడవు పెరిగే సమయం అదే. ఆ తర్వాత శరీరంలో ఈస్ట్రోజెన్‌ స్థాయులు పెరిగిపోతుంటాయి. ఫలితంగా ఎదుగుదల ఆగిపోతుంది. అందుకే, రజస్వల అయిన అమ్మాయికి విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉండే చక్కటి పౌష్టికాహారాన్ని అందించాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండేలా చూడాలి. లావు అయితే మాత్రం హార్మోన్లలో తేడా వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువగా తినాలి – ఎక్కువగా వ్యాయాయం చేయాలి. ఈ దశలో డైటింగ్ మంచిది కాదు. హార్మోన్లు పెరిగితేనే అమ్మాయి అందచందాలు నిండుగా పెరుగుతాయి. లేకపోతే సరైన పెరుదల ఉండదు.

Advertisement