అక్టోబర్ లోనే ఎన్నికలు – కేసీఆర్ ప్రకటన వెనక వ్యూహమెంటి..?

బీఆర్ఎస్ ఆవిర్భావ ప్లీనరీలో కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అక్టోబర్ లో ఎన్నికలు ఉంటాయని… ఇందుకోసం ఎమ్మెల్యేలంతా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే డిసెంబర్ లో పోలింగ్ ఉంటుంది. కానీ కేసీఆర్ మాత్రం అక్టోబర్ లోనే ఎన్నికలు ఉంటాయని చెప్పడం ఆ పార్టీ నేతల్లో తీవ్ర చర్చకు కారణమైంది. పక్కా సమాచారంతోనే ఇలా ప్రకటన చేశారా..? లేక తమను అలర్ట్ చేసేందుకే ముందుగానే ఎన్నికలు ఉంటాయని అబద్దం చెప్పారా..? అని ఎమ్మెల్యేలు గుసగుసలాడుకుంటున్నారు.

Advertisement

వాస్తవానికి అక్టోబర్ నెల ద్వితీయార్థంలో ఎన్నికల ప్రకటన ఉండొచ్చు. డిసెంబర్ మొదటి వారంలో పోలింగ్ ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొనే ఎమ్మెల్యేలను అప్రమత్తం చేసేందుకు కేసీఆర్ అక్టోబర్ లో ఎన్నికలు ఉంటాయని చెప్పినట్లు తెలుస్తోంది. ముందుగానే ఎన్నికలు ఉంటాయని చెబితే ఎమ్మెల్యేలంతా బుద్దిగా నియోజకవర్గాల్లో పని చేసుకుంటారని… ప్రజల్లో ఉంటారని కేసీఆర్ ఈ విధమైన కామెంట్స్ చేసి ఉంటారన్న చర్చ జరుగుతోంది. గతంలో ఎప్పుడు పార్టీ నేతల సమావేశం జరిగినా సిట్టింగ్ లందరికీ టికెట్లు ఉంటాయని చెప్పే కేసీఆర్ ఈసారి మాత్రం అలాంటి సంకేతాలు ఇవ్వలేదు.

Advertisement

గురువారం జరిగిన పార్టీ నేతలతో సమావేశంలో కేసీఆర్ ఎమ్మెల్యే లను కాస్త భయపెట్టించేలా వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఎమ్మెల్యేల చిట్టా తన దగ్గర ఉందని…తీరు మార్చుకోకపోతే తోకలు కట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. దళిత బందులో కమిషన్లు నొక్కుతున్నారని ఫైర్ అయ్యారు. అదే సమయంలో కొంతమంది సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వనని చెప్పేశారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు. సర్వే ఆధారంగా టికెట్ల కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేశారు.

గతంలో నలభై మంది సిట్టింగ్ లకు టికెట్ డౌటే అని ప్రచారం జరిగింది. వారిని బీజేపీ ఆకర్షించేందుకు ప్రయత్నించడంతో… కేసీఆర్ అలర్ట్ అయ్యారు. సిట్టింగ్ లకు టికెట్లు ఇస్తామని చెప్పారు కాని ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యేలకు కొంతమందికి టికెట్లు ఇవ్వబోనని హెచ్చరించారు.

Advertisement