Health Tips : అందరూ పండ్లను మంచి ఆరోగ్యం కోసం తీసుకుంటూ ఉంటారు. ఎన్నో రకాల పండ్లను తింటూ ఉంటారు. అయితే ఈ పండ్లలో ఉండే గింజలు మాత్రం అస్సలు తినొద్దు.. అవి చాలా ప్రమాదం కరం.. ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది..ఇటీవల లో హెల్ది ఆహారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. కూరగాయలు పండ్లతో పాటు గింజలను కూడా తీసుకుంటున్నారు. చియా, సబ్జా గింజలు, పొద్దు తిరుగుడు, గుమ్మడి వీటన్నిటిని తీసుకుంటున్నారు. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంత మంచి ఓ అందరికీ తెలిసిందే. అయితే కొన్ని రకాల పండ్లలో గింజలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ పండ్లు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… చెర్రీ ఫ్రూట్ ఈ పండు చూడడానికి ఎర్రగా అందంగా ఉంటుంది.
అయితే దీని గింజలు ఆరోగ్యానికి ప్రమాదకరం. ఈ చెర్రీ విత్తనాలలో సైనైడ్ సమ్మేళనం ఉంటుంది. దీన్ని ఎక్కువ మోతాదులో తినడం వలన కడుపులో వికారం, విరోచనాలు, తిమ్మిర్లు లాంటివి వస్తాయి. అలాగే ఆప్రికాట్: ఈ పండు విత్తనాలు ఆరోగ్యానికి విషం మాదిరి. ఈ గింజలలో సైనోజేనిక్, గ్లైకోసైడ్స్ ,అమీ గాలెన్స్ అనే టాక్సిన్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన శరీరం బలహీన పడుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. ఈ గింజలను ఎక్కువగా తీసుకోవడం వలన కోమాలకి కూడా వెళ్లే అవకాశం ఉంది. అలాగే పియర్ ఈ పండు విత్తనాలు కూడా ఆరోగ్యానికి డేంజరే.. ఈ గింజలలో ప్రాణాంతకరమైన సైనైడ్ సమ్మేళనం ఉంటుంది. వీటిని తీసుకోవడం వలన విరోచనాలు, వికారం, కడుపునొప్పి లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన విపరీతమైన అలసట, కడుపులో తిమ్మిర్లు, చెమటలు పట్టడం లాంటివి ప్రారంభమవుతాయి ఒక్కొక్కసారి కోమాలోకి కూడా వెళ్లే అవకాశం ఉంది.
Health Tips : మర్చిపోయి కూడా తినవద్దు… ప్రాణాలు డేంజర్ లో పడ్డట్టే…

అలాగే పీచు ఈ గింజలకి ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి. ఇవి అమీగ్లాడిన్, సైనోజెనిక్, గ్లైకోసైట్లను దీనిలో ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన మనసులో అనుకోని భయంతో పాటు కడుపునొప్పి, శారీరిక బలహీనత లాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అలాగే కోమలోకి వెళ్లే అవకాశం కూడా ఉంది. కాబట్టి వీటిని అస్సలు ముట్టవద్దు. ఇక ఆపిల్ అంటే అందరూ ఇష్టంగా తింటూనే ఉంటారు. ఈ ఆపిల్ తినడం వల్ల ఆరోగ్యం ఎంత మంచిగానో ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అయితే ఆపిల్ అనేది ఆరోగ్యానికి మంచిదే కానీ దీనిలో ఉండే గింజలు మాత్రం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఈ గింజలు ఒకటో రెండో తింటే ఏమి కాదు. కానీ ఎక్కువ గా తినడం వలన చాలా డేంజర్. దీనిలో సైనాయిడ్ ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తినడం వలన విరోచనాలు, వికారం, ఒక్కొక్కసారి మరణం కూడా సంభవిస్తుంది