Viral Video : సఫారీలో అడవిలోకి వెళ్లిన టూరిస్టులకు షాకిచ్చిన ఏనుగు.. వాళ్లను ఏం చేసిందో తెలుసా?

Viral Video : అడవి అంటేనే క్రూర మృగాలు ఉంటాయి. జంతువులకు నిలయం అడవి. కానీ.. అడవిలోకి వెళ్లి జంతువులను డిస్టర్బ్ చేస్తే అవి ఊరుకుంటాయా? అందుకే.. అడవుల్లో ఉన్న జంతువులను డిస్టర్బ్ చేయకూడదు అంటారు. కానీ.. కొందరు మాత్రం అడవుల్లోని, జూలోని జంతువులను చూడటానికి డేర్ చేస్తుంటారు. పులులు, సింహాలకు ఎదురెళ్తుంటారు. కావాలని వాటితో ఫోటోలు దిగడానికి ట్రై చేస్తుంటారు. సాధారణంగా జంతువులను చూడటానికి సఫారీ జీపులో సవారీకి వెళ్తుంటారు టూరిస్టులు.

Advertisement
elephant chases safari jeep with tourists video goes viral
elephant chases safari jeep with tourists video goes viral

సఫారీలో అయితే.. జంతువులను దగ్గర్నుంచి చూసినట్టు ఉంటుంది. అయితే.. కొన్ని సార్లు వాహనాల్లో వెళ్లినా సరే.. కొన్ని జంతువులు వదలిపెట్టవు. ఆ వాహనాలపై దాడి చేయడమో.. వాటిని వెంబడించడమో చేస్తుంటాయి. అసలు మా ప్రాంతంలోకి ఎందుకు వస్తున్నారు అన్నట్టుగా అవి వాళ్లను అక్కడి నుంచి తరిమేస్తాయి. జంతువులు మన ఆవాసాల్లోకి వస్తే మనం ఎలా చేస్తామో… అవి కూడా అంతే. ఇప్పుడు అసలే అడవులు అంతరించి పోతున్నాయి. ఈనేపథ్యంలో అడవులను అంతరించకూడదు అని.. అడవుల్లోకి వెళ్లి జంతువులను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పడానికి ఉదాహరణగా ఉంది ఈ వీడియో.

Advertisement

Viral Video : ఏనుగు వెంబడించడంతో ఏం చేయాలో అర్థం కాని సఫారీ డ్రైవర్ ఏం చేశాడంటే?

అడవిలో ఉన్న జంతువులను చూడటానికి సఫారీలో కొందరు టూరిస్టులు వెళ్తుంటారు. ఇంతలో అక్కడికి ఓ ఏనుగు వస్తుంది. సఫారీని చూసి కోపంతో దాని ముందుకు వచ్చి అటాక్ చేయబోతుంది. దీంతో ఏం చేయాలో తెలియని సఫారీ డ్రైవర్ వెంటనే సఫారీని రివర్స్ లో పోనిస్తాడు. అయినా కూడా ఆ ఏనుగు ఆగకుండా అలాగే ఆ సఫారీ వెంట పడుతుంది. దీంతో స్పీడ్ పెంచి మరీ దాన్ని అలాగే వెనక్కి పోనిస్తాడు. కాసేపు అలాగే పరిగెత్తిన తర్వాత అలసిపోయిన ఆ ఏనుగు అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోతుంది. దీంతో హమ్మయ్య అని సఫారీలోని టూరిస్టులు ఊపిరి పీల్చుకుంటారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి.. జస్ట్ మిస్. ఆ ఏనుగు సఫారీపై దాడి చేసి ఉంటే.. టూరిస్టుల పరిస్థితి ఏమై ఉండేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా.. అడవుల్లోకి వెళ్లినప్పుడు జంతువుల బారి నుంచి తప్పించుకునేలా ముందే జాగ్రత్తలు తీసుకొని వెళ్లాలని.. లేకపోతే ఎప్పుడు ఎటువైపు నుంచి జంతువులు వచ్చి అటాక్ చేస్తాయో తెలియదని నెటిజన్లు సూచిస్తున్నారు.

Advertisement