Health Tips : ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అసలు ఎటువంటి ఆహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందో తెలుసుకుందాం. కూరగాయల కంటే ఆకుకూరల్లో అధికంగా కాల్షియం ఉంటుంది. రోజు మనం తినే భోజనం లో వీటిని తీసుకోవాలి. బ్రోకలీ, బ్రస్సెల్స్ లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. కివి ఫ్రూట్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఆహారంలో రోజూ వీటిని తీసుకోవడం వల్ల శరీరం హెల్తీగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ఎలా తీసుకోవాలో చూద్దాం. వర్షాకాలంలో ప్రతి ఒక్కరి శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి.
అలాగే అనేక రకాల ఆరోగ్య సమస్యలకు గురి అవుతారు. ఇలాంటి వాటి నుండి మన శరీరాన్ని కాపాడుకోవాలంటే, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అందువలన మనం రోజు వారు తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. వివిధ రకాల పండ్లను తీసుకోవడం వల్ల రోగ నిరోధకశక్తిని పెంచుకునే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం వల్ల వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని నిపుణులు తెలియజేశారు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు దరిచేరకుండా చూసుకోవచ్చు. బ్రౌను రంగు పండ్లు, కూరగాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి మలబద్దక సమస్యలను దూరం చేస్తాయి.
Health Tips : వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందో తెలుసా

గోధుమ రంగు పండ్లు, గింజలు, తప్పనిసరిగా తీసుకోవాలి.ఇవి రక్తంలోనే గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. కొలస్ట్రాల్ ను తగ్గించి, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. నీలం ,ఊదా రంగు పండ్లు, కూరగాయల్లో ఫైటో న్యూట్రీ యొంట్లు అధికంగా ఉంటాయి. బ్లాక్ బెర్రీస్ , రేగి పండ్లు, వంకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి శరీరంలో వాపులు తగ్గించి జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తాయి. నారింజ, కూరగాయల్లో కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. క్యారెట్ ,మామిడి, ఉసిరి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎర్ర బెండకాయలులో ఆంతోసినిన్స్ ఎక్కువగా ఉంటాయి. దానిమ్మ, టొమాటోలు ఈ రోజు తీసుకుంటే, గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి.