Viral Video : పోలీసులంటే ఎవరు.. వాళ్లే ఈ సమాజానికి ఆదర్శం. మనకు ఏ సమస్య వచ్చినా చెప్పుకోవాల్సింది పోలీసులకే. పోలీసులే లేకుంటే ఈ ప్రపంచం ఇలా ముందుకు సాగదు. ప్రజలందరికీ అండగా ఉంటూ.. వాళ్లకు ఏ సమస్య వచ్చినా ముందు నిలబడేవారు పోలీసులు. మహిళలపై ఏవైనా దాడులు జరిగినా… దొంగలు, దుండగులు, ఇలా అందరికీ అండగా నిలబడతారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమ గోడు చెప్పుకుంటే పోలీసులు వెంటనే వాళ్లకు తోచిన సాయం చేస్తారు. వాళ్ల సమస్యలను తీర్చేందుకు తమ ప్రాణాలనే పణంగా పెడతారు. పోలీస్ అంటే ఈ సమాజంలో ఉన్న రెస్పెక్టే వేరు.

అయితే.. కొందరు పోలీసులు తమ ప్రవర్తన కారణంగా మొత్తం పోలీసు శాఖకే అవమానం తీసుకొస్తున్నారు. పోలీసులు అంతా ఇంతే అన్నట్టుగా జనాలు అనుకునేలా ప్రవర్తిస్తున్నారు. ఒకరిద్దరు పోలీసులు చేసిన తప్పుకు నిజాయితీగా పనిచేసే పోలీసులంతా తలదించుకోవాల్సి వస్తోంది. తాజాగా యూపీలో అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
Viral Video : డ్యూటీ టైంలో మద్యం తాగి రచ్చ రచ్చ చేశారు
ఉత్తరప్రదేశ్ లోని జలౌన్ పీఎస్ పరిధిలో ధరమ్ వీర్ సింగ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. సునీల్ కుమార్ అనే వ్యక్తి హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఇద్దరూ జగమానపూర్ లో పెట్రోలింగ్ చేస్తున్నారు. డ్యూటీలో ఉండగానే పోలీసులు జగమానపూర్ లో పెట్రోలింగ్ చేస్తున్నారు. పెట్రోలింగ్ వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తూ ఒక చోటు వాహనాన్ని ఆపి ఇద్దరూ మద్యం తాగారు. ఫుల్ గా మద్యం తాగిన అనంతరం ఇద్దరి మధ్య ఏదో విషయమై గొడవ అయింది. దీంతో నడి రోడ్డు మీదనే తాగిన మత్తులో ఇద్దరూ కొట్టుకున్నారు. పోలీసులే ఇలా పిచ్చిగా కొట్టుకోవడం ఏంటి అని అక్కడి స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. వెంటనే అక్కడి వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి పోలీసులకు ఇదేం పోయే కాలం అని కామెంట్లు చేస్తున్నారు.