Sprouts Health Benefits : మంచి ఆరోగ్యం కోసం హెల్త్ డైట్ ని ఫాలో అవ్వాల్సిందే. లేచిన వెంటనే మనం తీసుకునే ఆహారం స్ప్రౌట్స్ తో మొదలు పెడితే… ఏ విధమైన అనారోగ్యం తలెత్తదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. స్ప్రౌట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. పప్పులు, ధాన్యాలలో పోషకాలు అధికంగా ఉంటాయి. ప్రతిరోజు వీటిని తీసుకోవడం వల్ల ఫిట్ , హెల్దీగా ఉంటారు. శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల న్యూట్రియెంట్ల లోపం తగ్గించుకోవడానికి పెసర, సోయాబీన్ వంటివి రోజు నానబెట్టుకుని తినాలి. విటమిన్లు వీటిలో పుష్కలంగా లభిస్తాయి.
సోయాబీన్స్, పెసర గింజల్లో ఫాస్ఫరస్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల మినరల్స్, విటమిన్స్ లోపం పూర్తిగా తగ్గుతుంది, స్ప్రౌట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుంది. పోషక పదార్థాలతో నిండిన ధాన్యాల తినడం వల్ల రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. సీజనల్ వచ్చే ఇన్ఫెక్షన్లు, జలుబు ,దగ్గు ,జ్వరం వంటి వ్యాధులను రాకుండా కాపాడుతుంది. స్ప్రౌట్స్, సోయాబీన్, పెసర తీసుకోవడం వల్ల చర్మానికి చాలా మంచిది.
Sprouts Health Benefits : ఈ మూడు రకాల స్ప్రౌట్స్ తీ న్నారంటే…

ముఖంపై ముడతలు, పింపుల్స్ కూడా తగ్గుతాయి. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను మెరుగుపరుస్తాయి. స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా బరువు తగ్గేందుకు కూడా బాగా సహాయపడతాయి. పెసర, సోయాబీన్స్ లో మినరల్స్, విటమిన్స్ తక్కువ మోతాదులో ఉంటాయి. ఇందులో మెగ్నీషియం కూడా ఉంటుంది. వీటిని తినడం వల్ల మజిల్స్ గట్టిగా తయారవుతాయి. ఇందులో ఉండే పొటాషియం, ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి.