Health benefits : పారిజాత మొక్క ఒక దేవతా వృక్షం. ఎందుకంటే భాగవతంలో ఈ చెట్టు గురించి వినే ఉంటారు. శ్రీకృష్ణుడు ఇంద్రుడి వనానికి వెళ్ళినప్పుడు అక్కడి పారిజాతం వృక్ష పూలను రుక్మిణి కోసం తీసుకు వస్తాడు. దానికి సత్యభామ తనకోసం పూలను తేలేదని అలుగుతుంది. అప్పుడు కృష్ణుడు ఆమె కోసం పారిజాత వృక్షాన్ని తీసుకువచ్చి తన పెరట్లో పెడతాను అని తనకు మాట ఇస్తాడు. కృష్ణుడు వెళ్లి దేవతలతో యుద్ధం చేసి మరి పారిజాత వృక్షాన్ని తీసుకువచ్చి సత్యభామ కి ఇస్తాడు. అయితే సత్యభామ ఎవరైతే పూల కోసం తీవ్రమైన తపస్సు చేస్తారో వారికి ఈ పూల ఇస్తాను అని శ్రీకృష్ణుడిని వరం కోరుకుంది అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ వృక్షాన్ని ఎక్కువగా ఎవరు పెంచరు.
ఒకవేళ పెంచిన ఆ పువ్వులు నేలపై పడిన తరువాతే దేవుడి పూజకు ఉపయోగించాలి. ఈ పూలు భూమిపై పడగానే దేవుడి పూలుగా మారుతాయి. అప్పుడు మాత్రమే దేవుని పూజకు వినియోగించాలి. అంతేకాకుండా ఆయుర్వేద శాస్త్రంలో పారిజాత వృక్షాన్ని కి మంచి పేరు ఉంది. ఈ పారిజాత వృక్షం వలన మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. పారిజాతం ఆకులు యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి మనకు ఆస్తమా మరియు అలర్జీను రాకుండా చేస్తాయి. అలాగే పారిజాత ఆకుల రసం జ్వరం, సయాటిక, రుమాటిజం, పాము కాటు విరుగుడుకు వినియోగిస్తారు. అలాగే పారిజాత పుష్పాలు చూడడానికి తెల్లగా కనిపిస్తాయి కానీ ఈ పువ్వుల వలన వైద్యశాస్త్ర పరంగా ఉపయోగాలు ఉన్నాయి. పారిజాత పువ్వులు గ్యాస్ సంబంధిత సమస్యలు, శ్వాస సంబంధిత సమస్యలకు బాగా పనిచేస్తాయి.
Health benefits : అయితే ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే.
అలాగే పారిజాత కాండమును పొడి లాగా చేసి కాళ్ల నొప్పులు ఉన్నవారు వాడితే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే జుట్టు రాలడం,తల మీద పేను కొరకడం సమస్యలకు సులువుగా పరిష్కారం చూపవచ్చు.అలాగే చర్మ సంబంధిత వ్యాధులను కూడా ఈ పారిజాతం తో నయం చేసుకోవచ్చు. అలాగే పారిజాత ఆకుల రసంలో కొద్దిగా చక్కెర వేసి బాగా కలిపి పిల్లలకు తాపిస్తే కడుపు సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. అలాగే పిల్లలకు దగ్గు జలుబు వచ్చినప్పుడు ఈ ఆకుల రసాన్ని త్రాగించటం వలన నయం అవుతుంది. అలాగే చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి. అంటే మన చర్మానికి అలర్జీలు రాకుండా చేస్తుంది. ఈ పారిజాత వృక్షాన్ని వైద్య శాస్త్రం ప్రకారం ఇంటి పెరటిలో పెంచుకోవడం మంచిది.