Health benefits : ఇప్పుడు థైరాయిడ్ సమస్య స్త్రీలను ఎక్కువగా బాధిస్తుంది. థైరాయిడ్ వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మన గొంతులో ఉండే సీతాకోకచిలుకల ఉండే గ్రంథినే థైరాయిడ్ అంటారు. థైరాయిడ్ గ్రంథి పరిమాణం మారినప్పుడు మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా బరువు పెరగటం, సంతానం కలగక పోవడం లాంటి సమస్యలు వస్తున్నాయి. ప్రతి ఒక్క సమస్యకు ఆహారమే పరిష్కారం. థైరాయిడ్ ను నియంత్రణలో ఉంచుకోవాలంటే కొన్ని ఆహార పదార్థాలు సహాయపడతాయి. థైరాయిడ్ ను నియంత్రణలో ఉంచేందుకు జింక్, ఐరన్, మెగ్నీషియం, అయోడిన్, విటమిన్ బి, సి, డి, సెలేనియం వంటి పోషకాలు అవసరం. ఈ పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకుంటే థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు గింజలను తింటే థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1) గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు అధిక మోతాదులో దొరుకుతాయి. ఇవి మన శరీరంలో థైరాయిడ్ హార్మోన్ లను నియంత్రణలో ఉంచుతాయి. గుమ్మడి గింజలను రోజు తినడం వలన థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది. కనుక థైరాయిడ్ సమస్య ఉన్నవారు వీలైనంతవరకు గుమ్మడి గింజలను తినడానికి ప్రయత్నించండి. ఎక్కువగా మెడిసిన్స్ వాడకుండా ప్రకృతిలో దొరికే వాటిని వినియోగించుకోండి. అలాగే ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. ఉసిరికాయను తినడం వలన థైరాయిడ్ బాధితులకు ఆ సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. విటమిన్ సి థైరాయిడ్ హార్మోన్లను వాటి పరిమాణం తగ్గకుండా పెరగకుండా చేస్తుంది. కనుక థైరాయిడ్ బాధితులు ఉసిరికాయను తప్పనిసరిగా తినండి.
Health benefits : థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది.

2) బ్రెజిల్ నట్స్ లో సెలీనియం అనే పోషకం ఎక్కువగా ఉంటుంది.ఇది థైరాయిడ్ హార్మోన్లను నియంత్రణలో ఉంచుతాయి. ప్రతిరోజు బ్రెజిల్ నట్స్ ను తీసుకోవడం వలన థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది. అలాగే థైరాయిడ్ బాధితులకు కొబ్బరి కూడా చాలా మంచిది. ప్రతి రోజు పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి తీసుకుంటే జీర్ణక్రియ ప్రక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. కొబ్బరిలో ఉండే చైన్ ఫ్యాటీ ఆసిడ్స్, ట్రైగ్లీజరైడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జీవక్రియ మంచిగా పని చేసేలా చేస్తాయి.
3) పెసలలో ప్రోటీన్స్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ముఖ్యంగా పెసలలో అయోడిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ తో బాధపడేవారు రోజు పెసలను తినడం ద్వారా థైరాయిడ్ ను సులువుగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. వీటితో పాటు శనగలు, ఆవు పాలు, మజ్జిగ, ఆకుకూరలు తినడం వలన థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది. కనుక థైరాయిడ్ తో బాధపడేవారు ఈ మూడింటిని ప్రతిరోజు తినే ఆహారంలో తీసుకోవడం వలన థైరాయిడ్ ను సులువుగా నియంత్రణలో ఉంచుకోవచ్చు.