Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం వ్యాధి ప్రపంచాన్ని మొత్తాన్ని వోనికిస్తుంది. చక్కెర వ్యాధి అంటేనే జనాలు భయపడుతున్నారు. వామ్మో ఏం తింటే షుగర్ వ్యాధి వస్తుందని అనుక్షణం భయపడుతున్నారు. అయితే అన్నంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల దాన్ని తినడం వల్ల చాలామంది షుగర్ వ్యాధికి గురి అవుతున్నారు. ఈ రోజుల్లో చాలామంది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ.. పిచు పదార్థం తక్కువగా ఆహార పదార్థాలు తినడం వల్ల చిన్న వయసులోనే డయాబెటిస్ వ్యాధికి గురి అవుతున్నారు. ఒకసారి షుగర్ వచ్చిందంటే.. ఇక ఏం చేసినా విడిచిపెట్టదు. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. ఈ వ్యాధి వస్తే.. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినకూడదు..
అదేవిధంగా గ్లూకోజ్ ఎక్కువగా ఉండే పదార్థాలను కూడా తీసుకోకూడదు. ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు తింటే మంచిది. ఈ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది. అయితే ఈ సమస్యతో బాధపడుతున్న వారు వంట నూనెల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో లభించే నూనెలో సన్ఫ్లవర్ నూనె ,పల్లీ నూనె ,పామాయిల్ నూనె ,కాటన్ నూనె… వీటిలో కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి. దీంతో చెడు కొలస్ట్రాలు పెరిగిపోతాయి. దీనివల్ల హృదయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే షుగర్ ఉన్న వాళ్ళు వంట నూనెల కన్నా..
Diabetes : అయితే కొబ్బరి నూనెను వాడండి.. ఈ నూనె వాడడం వల్ల డయాబెటిస్ పేషెంట్లకు…

కొబ్బరి నూనెను ఉపయోగించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కేరళ రాష్ట్రంలో చాలామంది కొబ్బరి నూనెతో వివిధ రకాల వంటలు చేస్తారు. ఇలా కొబ్బరి నూనెతో తయారుచేసిన వంటలు తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కొబ్బరి నూనె మన శరీరానికి హాని చేసే ట్రై గ్లిజరైడు లను తగ్గిస్తుంది. శరీరానికి కావాల్సిన ఇన్సులిన్ కొబ్బరి నూనె ద్వారానే వస్తుంది. తద్వారా షుగర్ లెవె కూడా అదుపులో ఉంటాయి.