Health Benefits : మనం రోజూ చూసే మొక్కలలో పుదీనా ఒకటి, దీనిని రోజు ఆహారంతో పాటు తీసుకుంటే కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు. పుదీనాలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని జీర్ణ సంబంధిత వ్యాధులకు ఉపయోగిస్తారు. పుదీనా ఆకుల రసంలో కొంచెం తేనె , అల్లం రసం, దాల్చిన చెక్క కలిపి మెత్తగా చేసి రోజుకు ఒక గ్లాసు తీసుకుంటే జీర్ణ సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి. రోజు గుప్పెడు పుదీనా ఆకులను తీసుకుంటే కడుపునొప్పి తగ్గి కొద్దిగా ఉపశమనం ఉంటుంది.
ఒక గ్లాస్ నీటిలో 5, 6 పుదీనా ఆకులను వేసి బాగా మరిగించిన కషాయాన్ని రోజు తీసుకుంటే జ్వరం తగ్గడమే కాకుండా చాతిలో మంట, మూత్ర సంబంధిత వ్యాధులకు నివారిణిగా పని చేస్తుంది . గర్భిణీలు ఒక స్పూన్ పుదీనా రసం, దానిలో కొంచెం తేనె, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని తీసుకుంటే యాసిడిటీ, వాంతులు వంటివి తగ్గుతాయి, అలాగే నిద్ర లేని వారికి, టెన్షన్స్, చిగుళ్ళ వ్యాధులకు వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి. వేడి నీటిలో గుప్పెడు పుదీనా ఆకులు వేసి 20 నిమిషాల తర్వాత తాగితే చాలా మంచి ఫలితం ఉంటుంది.
Health Benefits : పుదీనా ఔషధాలు గని

ఈ ఆకులు రసాన్ని తీసి తలనొప్పి ఉన్నవారికి నుదుటికి రాస్తే నొప్పి తగ్గి తలకు చల్లదనాన్ని ఇస్తుంది. ముక్కులో కానీ, చెవిలో ఇన్ఫెక్షన్ ఉన్నవారికి ఈ పుదీనా ఆకులు రసాన్ని తీసి దూది సహాయంతో అప్లై చేస్తే ఇన్ఫెక్షన్ తగ్గి మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే పుదీనా ఆకులను ఎండబెట్టి పొడిచేసి ఈ చూర్ణంతో దంతాలు శుభ్రపరచడం వల్ల ఇన్ఫెక్షన్స్, చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి. అలాగే దంతాలు గట్టి పడి నోటి దుర్వాసనను అరికడుతుంది.
చర్మం పై ఏర్పడే మచ్చలు ,మొటిమలు, కురుపుల కు ఒక స్పూన్ పుదీనా రసంలో చిటికెడు పసుపు కలిపి మర్దనా చేస్తే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు. చిన్నపిల్లలకు మలబద్దక సమస్యలను తగ్గించడానికి ఒక గ్లాస్ నీటిలో ఐదు పుదీనా ఆకులు వేసి బాగా కాచి తాగించడం వల్ల ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. తరచుగా రెండు గ్లాసుల నీటిలో పుదీనా ఆకులు, నల్ల మిరియాలు వేసి గోరువెచ్చగా కాచి దానిలో కొద్దిగా తేనె యాడ్ చేసుకుని తీసుకుంటే పొడి దగ్గు వంటి సమస్యలు దూరం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు