Mushroom Side Effects : చాలామంది పుట్టగొడుగుల్లో పోషకాలు అధికంగా ఉంటాయని ఎక్కువగా తీసుకుంటారు. కొందరు మష్రూమ్స్ ను చాలా ఇష్టపడతారు. పుట్టగొడుగులు ఇష్టమని ఎక్కువగా తీసుకునే వారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే వీటిని తినడం వల్ల ప్రయోజనాలతో పాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రోజు పుట్టగొడుగులను ఆహారంగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. పౌష్టికాహారమైన పుట్టగొడుగులను అధికంగా తినే వారికి గుండె జబ్బులు, బ్రెయిన్ సంబంధిత సమస్యలు తలెత్తవు.
యాంటీ బ్యాక్టీరియల్, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండే పుట్టగొడుగులను కొన్ని రకాల మందులు తయారీలో కూడా ఉపయోగిస్తారు. అయితే ఇన్ని ప్రయోజనాలను అందించే ఈ ఫుడ్ ని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని అంటున్నారు నిపుణులు. మష్రూమ్స్ తో వండిన వంటకాలు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పెంపొందించడంలో సహాయపడతాయి. దాదాపు మాంసం తో పాటు పోషకాలను అందిస్తాయి పుట్టగొడుగులు. కిడ్నీ ,కాలేయా ,శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా పుట్టగొడుగులు దూరం చేస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి చెడు కొలస్ట్రాలను దూరం చేస్తాయి. అయితే ఇన్ని గొప్ప ప్రయోజనాలు ఉన్న పుట్టగొడుగులలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే.
Mushroom Side Effects : అయితే, తస్మాత్ జాగ్రత్త

స్కిన్ ఆలర్జీలు :
పుట్టగొడుగులను అతిగా తీసుకునేవారికి స్కిన్ సమస్యలు తలెత్తుతాయి. వీటిని తినడం వల్ల చర్మంపై ర్యే షెస్, దద్దుర్లు వంటివి మొదలవుతాయి. కాబట్టి, వీటిని మితంగా తీసుకోవాలని చెబుతున్నారని నిపుణులు.
వాంతులు, విరోచనాలు, కడుపులో వికారం:
మష్రూమ్స్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు విరోచనాలు కడుపులో వికారం వంటి సమస్యలు మొదలవుతాయి. పుట్టగొడుగులు సిలింద్రియాలు కాబట్టి కొందరికి వీటిని తినడం వల్ల విరోచనాలు అవుతాయి. కొందరికి వీటి రుచి వాసన పడదు. అటువంటివారు వీటికి దూరంగా ఉండటం మంచిది.
మానసిక సమస్యలు:
పుట్టగొడుగులు కొన్ని రోజులు వరకు తీసుకున్న తర్వాత రియల్ వరల్డ్ లేదా వాస్తవ ప్రపంచంలో ఏం జరుగుతుందనేది క్లారిటీగా తెలుసుకోలేకపోవచ్చు. లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా అనిపించవచ్చు.
ప్రపంచంలో అనేక పుట్టగొడుగులు లభిస్తాయి. వీటిల్లో మేజిక్ మష్రూమ్స్ ఒకటి. వీటిని వరల్డ్ మష్రూమ్స్ అంటారు
నిద్ర మత్తు లేదా మైకం:
మష్రూమ్స్ ని తీసుకున్న వెంటనే కొందరు మత్తులోకి జారిపోతారు. వీటిలోనే ఎనర్జీ అంతా కూడా బాగా తగ్గిపోతుంది. ఇక వీటిని తీసుకున్న వెంటనే కొందరికి మత్తుగా ఉండి నిద్రలోకి జారిపోతారు. ఇటువంటి సమస్య ఉంటే మీరు మష్రూమ్స్ కి దూరంగా ఉండటం మంచిది