Health Tips : ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సమయానికి తిండి తినక వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ మధ్య ఎక్కువగా బాధపెట్టే సమస్య గ్యాస్ ట్రబుల్. ఎక్కడికి అయినా వెళ్లాలంటే పాకెట్ మనీలో ముందుగా డబ్బుల కంటే గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ వుండేలా చూసుకుంటున్నారు. గ్యాస్ ప్రొబ్లమ్ రాగానే ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు. ఇలా కాకుండా సులువుగా గ్యాస్ నుంచి ఉపశమనం పొందాలంటే ముఖ్యంగా రెండు చిట్కాలను పాటించాలి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
మొదటి చిట్కా: ముందుగా గ్యాస్ సమస్య రాగానే కొన్ని వేడినీళ్లు తాగాలి.మనం ఎక్కడకు వెళ్లినా సరే వేడినీళ్లు అందుబాటులో ఉంటే టీ తాగినట్లుగా కొంచెం కొంచెం తాగితే గ్యాస్ నుంచి త్వరగా రిలీఫ్ పొందవచ్చు. ఈ వేడి నీళ్లను తాగడం వలన పొట్టలోని గ్యాస్ మొత్తం పోయి త్రేన్పుల రూపంలో బయటికి వస్తుంది. ఐదు నిమిషాలలో గ్యాస్ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎటువంటి ట్యాబ్లెల్ వేసుకోకుండా సులువుగా గ్యాస్ సమస్య తగ్గుతుంది. అలాగే రోజు పరిగడుపున అరగ్లాసు నీళ్లను వేడిచేసుకొని తాగితే గ్యాస్ సమస్య ఎప్పటికి రాదు.
Health Tips : అరగ్లాసు నీళ్లు… పొట్టలోని గ్యాస్ హాంఫట్…
రెండవ చిట్కా: ఒక గ్లాసు వాటర్ లో వాము వేసి బాగా మరిగించాలి. నీళ్లను కొద్దిగా చల్లార్చి గోరువెచ్చని నీళ్లను తాగితే గ్యాస్ సమస్య తగ్గుతుంది. వాము నీళ్లు పొట్టలోని గ్యాస్ ను తగ్గించి ,కడుపు నొప్పిని తగ్గిస్తుంది. వామును నీటిలో వేసి మరిగించడం వీలు కాకపోతే కొంచెం వామును నోట్లో వేసుకొని నమలాలి. ఇలా చేయడం ద్వారా కూడా గ్యాస్ నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే రోజు పరిగడుపున ఈ వామునీళ్లను తాగితే గ్యాస్ సమస్య ఎప్పటికి రాదు.
ట్యాబ్లెట్స్ వేసుకుంటే కొద్దిసేపు మాత్రమే గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అందుకే చిన్న చిన్న వాటికి ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఇలా వంటింటి చిట్కాలు ఫాలో అయితే సులువుగా గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎక్కువగా ట్యాబ్లెట్స్ ను వాడడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కనుక సులువుగా గ్యాస్ సమస్య నుంచి తప్పించుకోవాలంటే ఇలా వంటింటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.