Health benefits : అందరికి పటిక తెలిసే ఉంటుంది. పటికను ఎక్కువగా పిప్పి పన్ను నొప్పి రాకుండా వాడతారు. దీనిని పొడిగా చేసి నొప్పి వున్న చోట రాస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ పటికను చర్మం నల్లగా ఉన్న భాగంలో రాస్తే చర్మం తెల్లగా అవుతుంది. పటికను పొడిగా చేసి గోరువెచ్చని నీళ్లల్లో వేసి కాళ్లను కొద్దిసేపు ఉంచడం వలన కాళ్లు తెల్లగా అవుతాయి. మోచేతులు, మోకాళ్లు దగ్గర చర్మం నల్లగా వుంటుంది. ఈ పటిక పొడిని వేసి రుద్దితే తెల్లగా అవుతాయి. అలాగే స్నానం చేసేటప్పుడు నీళ్లల్లో వేసుకొని చేస్తే చర్మం తెల్లగా అవుతుంది.
ఈ పటిక పొడిని వేడి నీళ్లల్లో వేసుకొని నోటిలో పోసుకొని పుక్కలించడం వలన నోటి నుంచి వచ్చే చెడు వాసన తగ్గుతుంది.అలాగే కొంతమంది మొటిమల సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటివారు పటికపొడిలో కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలిపి మొటిమలు ఉన్నచోట రాస్తే మొటిమలు తగ్గుతాయి. అలాగే జెంట్స్ షేవింగ్ చేసుకున్నాక ఇన్ ఫెక్షన్ రాకుండా వుండాలంటే గడ్డం పై ఈ పటిక పొడిని రుద్దాలి. ఇలా చేస్తే ఇన్ ఫెక్షన్ రాకుండా వుంటుంది.
Health benefits : పటిక ఫేస్ ప్యాక్ తో తెల్లగా అయిపోతారు.

ఇప్పుడు ఫేస్ కి ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం…ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్ఫూన్ పటిక పొడి వేసుకోవాలి. తరువాత అందులోకి ఒక స్ఫూన్ కస్తూరి పసుపు వేసుకోవాలి.మాములు పసుపు వాడకూడదు. దీనిలోకి ఒక అరస్ఫూన్ తేనె వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత అందులోకి అరస్ఫూన్ నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ను మొహానికి రాసుకొని ఐదు నిమిషాల పాటు రుద్దుతు మసాజ్ లాగా చేసుకోవాలి. తరువాత కూల్ వాటర్ తో ఫేస్ ను కడుక్కోవాలి. ఇలా చేయడం వలన మొహంలో నలుపు పోయి అందంగా, తెల్లగా తయారవుతుంది.