Health benefits : చాలామందికి కళ్ళ కింద నల్లగా మచ్చలు ఏర్పడుతాయి. ఎందుకు అలా ఏర్పడుతుంది అంటే కంటి నిండా నిద్ర లేకపోవడం, వయసు ప్రభావం, శరీరాన్ని సరిపడా నీరు తాగకపోవటం, పొగతాగటం, మద్యం సేవించడం వంటి వివిధ రకాల కారణాల వల్ల కళ్ల చుట్టూ నల్లగా మచ్చలు వస్తాయి. ఈ సమస్య నుంచి అంతా ఈజీగా బయటపడటం కష్టమే. కొందరు కళ్ళ చుట్టూ మచ్చలు ఉండటం వలన నలుగురులోకి వెళ్లి మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటారు. అయితే కొన్ని చిట్కాలు సులువుగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని వైద్యశాస్త్రం నిపుణులు అంటున్నారు. ఈ చిట్కాలను కనుక అనుసరించినట్లయితే కళ్ళ కింద మచ్చలు పోయి మీ ముఖం అందంగా కనబడుతుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
1) శరీరానికి నీళ్లు సరిపడా అందకపోతే ఆరోగ్య పరంగా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. అందుకే నీళ్లను సర్వరోగ నివారణని అంటారు. మంచినీళ్లను తక్కువగా తాగడం వలన కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. మన బాడీలో సరిపడా నీళ్లు లేకపోతే బాడీ బారిన డిహైడ్రేషన్ పడుతుంది. దీనివలన కంటి చుట్టూ నల్లటి మచ్చలు వస్తాయి. అందుకే రోజు 10 గ్లాసులు నీళ్లను తాగడం మంచిది.
Health benefits : కళ్ళ కింద ఏర్పడే నల్లటి మచ్చలతో బాధపడుతున్నారా

2) అలాగే నిద్ర సరిగ్గా పోకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. కంటి నిండా నిద్ర లేకపోతే కంటి చుట్టూ డార్క్ సర్కిల్ ఏర్పడతాయి. ఇలా మచ్చలు రాకుండా ఉండాలంటే రోజు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. ఇలా చేస్తేనే కంటి చుట్టూ వలయాలు ఏర్పడకుండా ఉంటాయి.
3) శారీరక శ్రమ లేకపోవడం వలన కూడా మన చర్మంపై ప్రతి కుల ప్రభావం ఏర్పడుతుంది. శరీరానికి ఎక్కువ పని చెప్పకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే ప్రతిరోజు కొద్దిసేపు వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.
4) అలాగే ప్రతిరోజు మద్యం సేవించడం వలన కూడా డార్క్ సర్కిల్ ఏర్పడతాయి. అందుకే ఆల్కహాలను ఎక్కువగా తాగకూడదు. పరిమితికి మించి తాగితే చర్మంపై ప్రతి కుల ప్రభావాన్ని చూపిస్తుంది. ఆల్కహాలను ఎక్కువగా తాగితే మీరు త్వరగా ముసలి వారు అవుతారు స్కిన్ పై ముడతలు వస్తాయి. చర్మం పొడి పొడిబారుతుందీ. అలాగే ధూమపానం కూడా చేయకూడదు. దానీ వలన కూడా కళ్ళ కింద డార్క్ సర్కిల్ ఏర్పడతాయి.
5) ఉప్పు మనకు ఆరోగ్యపరంగా ఎంతో అవసరం. కానీ ఉప్పును పరిమితికి నుంచి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉప్పును ఎక్కువగా వాడటం వలన కంటి కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. అందుకే ఉప్పును తగిన పరిమితి లో తీసుకోవాలి.