health tips : పోషకాలలో అత్యంత ప్రాముఖ్యమైనది విటమిన్ డి. ఈ విటమిన్ లోపం వలన వివిధ రకాల రోగాల బారిన పడుతాం.కనుక విటమిన్ డి లోపం కలుగ కుండా తగిన ఆహారం తీసుకోవాలి. ఈ విటమిన్ డి మన ఎముకలను బలంగా చేయడానికి సహాయపడతాయి. అయితే విటమిన్ డి మాంసాహారంలో పుష్కలంగా దొరుకుతాయి. కాని కొందరు మాంసాహారాన్ని తినరు. అలాంటివారు విటమిన్ డి లభించే ఆహారాన్ని తీసుకోవాలి. దీనివలన బాడీలో విటమిన్ డి తక్కువ కాకుండా ఉంటుంది. అలాగే వీరు ప్రతిరోజు ఉదయాన్నే ఒక అరగంట ఎండకు కూర్చోవాలి. ఇలా చేయడం వలన శరీరానికి విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఎముకలు కూడా గట్టిగా ఉంటాయి. అయితే శాకాహారులు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం…
మన శరీరంలో విటమిన్ డి తక్కువ కాకుండా ఉండాలంటే పెరుగును రోజు తినాలి. పెరుగును తినడం వలన మన బాడీ లోపలి నుంచి చల్లగా ఉంటుంది. వేసవిలో పెరుగును తప్పనిసరిగా తినాలి. లేకపోతే విటమిన్ డి లోపం కలిగి వివిధ రకాల రోగాల బారిన పడుతాం. పెరుగును తింటే మన శరీరానికి ప్రోటిన్లు, క్యాలరీలు అధిక మోతాదులో అందుతాయి. కనుక ప్రతిరోజు రెండు పూటలా ఆహారంలో పెరుగు ఉండేలా చూసుకోవాలి. అలాగే పాలలో విటమిన్ డి, కాల్షియం అధిక మోతాదులో ఉంటాయి. కనుక ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పాలను త్రాగడానికి ప్రయత్నించండి. విటమిన్ డి లోపం ఉన్నవారు తప్పనిసరిగా పాలను త్రాగవలసిందే. పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ఎందుకంటే పాలలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి.
health tips : వెజిటేరియన్స్ కు విటమిన్ డి కావాలంటే…ఇవి తినక తప్పదు…

అలాగే నారింజ పండులో విటమిన్ డి పుష్కలంగా దొరుకుతుంది. రోజు ఒక గ్లాసు నారింజ జ్యూస్ ను తాగడం వలన మీ బాడీలో విటమిన్ డి తగ్గకుండా ఉంటుంది. అలాగే కాల్షియం లోపం ఉన్నవారు ఆరెంజ్ జ్యూస్ ను తాగితే శరీరానికి చాలా మంచిది. బోన్స్ బలహీనంగా ఉన్నవారు నారింజ పండును తింటే చాలా మంచిది. అలాగే పుట్టగొడుగులో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది.కనుక ఈ పుట్టగొడుగులను సూప్ లేదా సలాడ్ రూపంలో ఆహారంగా తీసుకోవాలి. దీనివలన విటమిన్ డి తక్కువ కాకుండా చూస్తుంది. కాబట్టి విటమిన్ డి తక్కువగా ఉన్నవారు ఈ నాలుగు ఆహార పదార్ధాలను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.