Mithali Raj : మిథాలి రాజ్ డిసెంబర్ 3 ,1982 న రాజస్థాన్ జోధ్‌పూర్ లో జన్మించింది. మిథాలిరాజ్ పూర్వీకులు తమిళనాడుకి చెందిన వారు. తండ్రి పేరు దోరాయిరాజ్ ఆయన ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఉద్యోగి , తల్లి లీలారాజ్ గృహిణి, ఉద్యోగ బాధ్యతల నేపథ్యంలో దోరాయిరాజ్ పలు ప్రాంతాలకు బదిలీ అయ్యారు.హైదరాబాద్‌లో కొన్నాళ్లు ఉద్యోగం చేశాక ఇక్కడే స్థిరపడ్డారు. మిథాలి రాజ్ జోధ్‌పూర్ లొ పుట్టిన , చిన్న వయసులోనే హైద్రాబాద్ కి వచ్చారు. హై స్కూల్ లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. కస్తూరి బా గాంధీ కాలేజ్ లో ఇంటర్ పూర్తి చేశారు. వాస్తవానికి మిథాలి రాజ్ కి క్రికెట్ ఆడటం అంటే ఇష్టం కలగడం కూడా యాదృచ్ఛికంగా జరిగింది.
మిథాలి రాజ్ కి భరత నాట్యం అంటే ఆసక్తి ఉండేది. రోజూ ఆలస్యంగా నిద్రలేచే అలవాటు ఉండేది. పది ఏళ్ళ వయసులో రోజూ ఆలస్యంగా నిద్రలేవడం గమనించారు తండ్రి దోరాయి రాజ్ మిథాలి రాజ్ ఇలాగే చేస్తూ పోతే బద్ధకం పెరుగుతుందని భావించి సికింద్రాబాద్ లోని ఒక స్పోర్ట్స్ అకాడమీ లో చేర్పించారు మొదట మొండికేసిన ఆ తర్వాత క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం నేర్చుకున్నారు మిథాలిరాజ్. అదే టైమ్ లో భరత నాట్యం కూడా నేర్చుకున్నారు . ఎనిమిది ఏళ్ల పాటు భరత నాట్యం నేర్చుకొని ప్రదర్శనలు కూడా ఇచ్చారు. క్రికెట్ నేర్చుకున్నాక కుాడా భరతనాట్యం సాధన చేస్తూనే రెండింటిని బ్యాలెన్స్ చేశారు మిథాలిరాజ్. స్పోర్ట్స్ అకాడమీ లో మిథాలి రాజ్ ప్రాక్టీస్ ని చూసినా మాజీ పేసర్ జ్యోతిప్రసాద్ ఆమెకు మంచి శిక్షణ ఇప్పిస్తే మంచి క్రికెటర్ అవుతుందని చెప్పి ఆమె తల్లిదండ్రులను అతికష్టం మీద ఒప్పించి, మరో కోచ్ సంపత్ కుమార్ దగ్గరికి పంపించారు.
Mithali Raj : ఉమెన్ క్రికెటర్ మిథాలి రాజ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.

ఆమె ఆట తీరును గమనించిన సంపత్ కొన్నేళ్ల పాటు కోచింగ్ ఇచ్చాడు. ఆంధ్రా టీమ్ తరపున దేశవాళీ క్రికెట్ టోర్నీలో ఆడిన మిథాలిరాజ్ ఎయిర్ ఇండియా, రైల్వేస్ టీమ్ తరపున కూడా ప్రాతినిధ్యం వహించారు. తన కోచ్ సంపత్ కుమార్ అనుకున్నట్లుగా 1999 లో జూన్ 26 ఐర్లాండ్ తో జరిగిన వన్ డె లొ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కి అడుగుపెట్టారు. తొలి మ్యాచ్ లోనే 114 రన్స్ సాధించారు తన టెస్టు కెరీర్ 2001-2002 లో ప్రారంభించింది . మిథాలి 19 సంవత్సరాలు ఉన్నప్పుడు కరణ్ రోల్డన్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. కరణ్ 209 పరుగులు చేస్తే, మిథాలి 214 పరుగులు చేసి వరల్డ్ హయ్యస్ట్ ఇండివిడ్యుయల్ టెస్ట్ స్కోరర్ గా నిలిచింది.
మిథాలి బ్యాట్ తోనే కాకుండా పార్ట్ టైమ్ బౌలర్ గా కూడా వ్యవహరిస్తుంది. 2013 ఉమెన్స్ వరల్డ్ కప్ లో మిథాలి రాజ్ ఓడీఐ ఛాట్ లో నెంబర్ వన్ క్రికెటర్‌గా చోటు సంపాదించింది. ఫిబ్రవరి 2017 లో ఉమెన్ ఓడీఐ లీస్ట్ లో 5500 రన్స్ సాధించిన రెండో మహిళగా నిలిచి జులై 2017 లో 6000 రన్స్ సాధించి మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. మిథాలిని ముద్దుగా టెండూల్కర్ ఆఫ్ ఉమెన్ క్రికెట్ అని పిలుస్తారు. మిథాలికి మన ప్రభుత్వం 2003 లో అర్జున అవార్డ్ అలాగే 2015 లో పద్మశ్రీ అవార్డ్ ల తో సత్కరించింది. ఇప్పటివరకు మిథాలి వన్డేలో 6 సెంచరీలు, టెస్టుల్లో ఒక్క డబుల్ సెంచరీ సాధించింది. మిథాలి బ్యాటింగ్ యావరేజ్, టెస్టుల్లో 51, ఓడీఐ లో 52 గా ఉంది. 8 జూన్ 2022 నా మిథాలిరాజ్ తన రిటైర్మెంట్ ని ప్రకటించింది.