Janvi Kapoor : అందాల ముద్దుగుమ్మ జాన్వికపూర్ వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో దూసుకుపోతుంది. శ్రీదేవి బోనికపూర్ ముద్దుల తనయ అయినటువంటి జాన్వికపూర్ ధడక్ సినిమాలో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. శ్రీదేవి కూతురు అయినప్పటికీ తన బ్యాక్ గ్రౌండ్ ఏ మాత్రం వాడుకోకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. జాన్వీ కపూర్ సినిమాల్లో చేయాలన్న కోరిక తన చిన్నప్పటి నుంచే బలంగా నాటుకుపోయింది. అదే కసి తో ఎప్పుడూ తన అందాన్ని మెరుగు పరచుకోవడం కోసం ఎక్కువగా జిమ్ లో టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడూ తన ట్రెండ్ అవుతూ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
జాన్వి కపూర్ మంచి కథ దొరికితే దక్షిణాది సినిమాల్లో చేయడానికి సిద్ధంగా ఉందని బోనికపూర్ చెప్పడం జరిగింది. అయితే ఆమె ఎన్టీఆర్ 31 సినిమాకి జాన్వీ కపూర్ ని సెలెక్ట్ చేసినట్లుగా ఇండస్ట్రీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి ముందుగా దీపికా పదుకొనే సంప్రదించినట్లు తెలుస్తోంది. తను బిజీగా ఉండి షెడ్యూల్ కుదరకపోవడంతో జాన్వీ కపూర్ ఈ ప్రాజెక్టుకి అనుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే చూడాలి ఈ భామ Jrఎన్టీఆర్ 31 లో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందో లేదా అనేది. ఎన్టీఆర్ నటిస్తున్న ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ ఇండియా లెవల్లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నవంబర్ 2 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సినీ వర్గాలు తెలుపుతున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రానట్లు తెలుస్తుంది.
Janvi Kapoor : బ్లూ కలర్ డ్రెస్ లో అందాలభామ జాన్వి

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినీ ఇండస్ట్రీలో ఎదగాలంటే సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ అవసరం. ఈ పరిస్థితిని గుర్తించిన జాన్వికపూర్ సోషల్ మీడియా ని బాగా వాడుకుంటుంది. ఎప్పటికప్పుడు తన అందాల ఆరబోతతో కుర్రాళ్ల మనుషులు దోచుకుంటూ సోషల్ మీడియా ద్వారా తన ఫోటో షూట్ ఎప్పటికప్పుడు వైరల్ చేస్తోంది. ఇలా వైరల్ అయిన ఫొటోస్ లో ఈ మధ్య కాలంలో బ్లూ కలర్ డ్రెస్ లో తన ఓర చూపులతో కుర్రాళ్ళ మనసును కట్టిపడేస్తుంది. జాన్వి కపూర్ బ్లూ కలర్ డ్రెస్ లో తన అందాల విందును చేస్తూ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. తన అందాన్ని చూసినా కుర్రకారు తమ మనసులను పారేసుకుంటున్నారు.