Health tips : మంచి నీళ్లని త్రాగటం వలన చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో తగినన్ని నీళ్లను త్రాగటం అవసరం.పదిహేను సంవత్సరాలు పైబడి నీడపట్టున ఉన్నవాళ్లు కనీసం నాలుగు లీటర్ల నీళ్లను త్రాగాలి, ఎండ కి వెళ్లి వచ్చేవారు కనీసం ఐదు లీటర్ల నీళ్లను త్రాగాలి, ఎక్కువగా వేడి లోనే ఉంటూ, పొలం పనులు చేసేవారు కనీసం ఆరు లీటర్ల నీళ్లను త్రాగాలి, పిల్లలకు వారి వయస్సును బట్టి ఎన్ని తాగాలో అన్నీ తాగించాలి. ముఖ్యంగా ఐదు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు ఖచ్చితంగా 1 నుంచి 1.5 లీటర్ల నీళ్లను తాగించాలి.
ఆరు నుంచి పది సంవత్సరాల పిల్లలకి ఖచ్చితంగా 2 నుంచి 2.5 లీటర్ల నీళ్లని తాగిస్తే వేసవికాలం హాయిగా ఉంటారు, పది నుంచి పదిహేను సంవత్సరాల వయసు వారికి 3 నుంచి 3.5 లీటర్ల నీటిని తాగించాలి. వేసవి కాలంలో వేడిని తట్టుకోవడానికి శరీరానికి నీళ్లు ఎంతో అవసరం నీళ్ల సహాయంతో వేడిని తట్టుకుని వేసవికాలం హాయిగా సాగుతుంది. నీళ్లు తక్కువగా త్రాగేవారు ఒక టైం టేబుల్ పెట్టుకొని తాగండి.పెద్ద వాళ్లు ఉదయం లేచిన వెంటనే ఒకటి నుంచి ఒకటిన్నర లీటర్ల నీటిని తాగడానికి ప్రయత్నించాలి, అలాగే పిల్లలకి వాళ్ల వయసుకు తగ్గట్టుగా నీటిని తాగించాలి. ఉదయం లేచిన వెంటనే నీటిని త్రాగటం వలన పేగుల్లో కదలిక ఏర్పడి, సుఖవిరోచానాలు జరుగుతాయి.

దాని వలన మలబద్దకం సమస్య ఉండకుండా, ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఎంతగానో దోహదపడుతుంది. టిఫిన్ తిన్న తర్వాత 2 గంటల వరకు నీళ్లు తాగకుండా ఉండి , 2 గంటల తర్వాత నుంచి లంచ్ తినేలోపు మూడు నుంచి నాలుగు గ్లాసుల నీటిని త్రాగటం మంచిది, అప్పుడప్పుడు ఈ నీరు రక్తంలోకి వెళ్లి చల్లదనాన్ని ఇస్తుంది , లంచ్ చేశాక 2 గంటల వరకు నీళ్లు తాగకుండా ఉండి, 2 గంటల తర్వాత తాగడం ప్రారంభించాలి ప్రతి అరగంటకు ఒకసారి ఒక గ్లాస్ నీళ్లని సాయంత్రం వరకు త్రాగటం మంచిది. ఎండలో ఉండి పనిచేసేవారు ఎక్కువగా నీళ్లని త్రాగటం అవసరం.మనం తీసుకున్న ఆహారంలోని ఏదైనా క్రిములు ఉంటే దానిని నోటిలోని లాలాజలం చంపుతుంది.
ఒకవేళ ఆ క్రిములు పొట్టలో కి వెళితే అప్పుడు అక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే ఘాటైన యాసిడ్ క్రిములను చంపుతుంది, అంతేకాకుండా ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఘాటు తో మనం తిన్న ఆహారం మెత్తగా జీర్ణం అవుతుంది. ఇలా హైడ్రోక్లోరిక్ యాసిడ్ రెండు విధాలుగా మనకు మేలు చేస్తుంది. ఒక్క గ్లాసు వాటర్ ని మనం ఆహారం తినడానికి ముందు తీసుకోవటం వలన మన పొట్టలోనే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తయారవుతుంది, అందువలన మనం ఆహారాన్ని తినడానికి ఇరవై నిమిషాల ముందు నీళ్లని త్రాగడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది. నీళ్ళు త్రాగడం వల్ల నోరు పరిశుభ్రంగా ఉంటుంది, నీళ్ళు త్రాగడం వల్ల స్కిన్ హెల్దీగా ఉండి, ఫేస్ లో గ్లో వస్తుంది.ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో వాటర్ ని తక్కువగా తాగే అందరూ తప్పకుండా త్రాగడం అలవాటు చేసుకొని ఎన్నో లాభాలను పొందండి.