Custard Apple : అక్టోబర్ నవంబర్ నెలలో సీతాఫలం సమృద్ధిగా లభిస్తుంది. ఈ పండు తినడం వల్ల శరీరానికి కావలసిన అవసర గుణాలను పొందవచ్చు. అయితే సీతాఫలాన్ని కొందరు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని జబ్బులు ఉన్నవారు ఈ పండుకు దూరంగా ఉండడం మంచిది. ఈ పండు తో పాటు విత్తనాలు ఆకులు కూడా ఎన్నో ఔషధ గుణాల కలిగి ఉంటాయి. సీతాఫలం కొన్ని వ్యాధులనే నయం చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని అధికం చేస్తుంది. ఈ ఫలం తినడం వల్ల జీర్ణరసాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దీనిలో క్యాలరీలు అధికంగా ఉండటం వల్ల బరువు పెరగాలి అనుకునే వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ పండును అధికంగా తీసుకోవడం వల్ల ఈజీగా బరువు పెరగవచ్చు. సీజన్లో లభించే ఈ సీతాఫలం తినడం వల్ల గర్భవతులు కు చాలా మంచిది.
Custard Apple : సీతాఫలం తినే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే.
గర్భధారణ జరగకుండా, గర్భంలో ఉన్న శిశువు మెదడు, నాడీ వ్యవస్థ పెరుగుదలకు ఉపయోగపడుతుంది. మెగ్నీషియం ఈ పండులో అధికంగా ఉంటుంది. ఇది గుండెపోటు సమస్యలు రాకుండా అరికాడుతుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. సీతాఫలంలో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు ఉన్నవారు రోజు ఒకటి తింటే చాలా మంచిది. ఈ పండులో ఉండే డైటరీ ఫైబర్ శరీరంలో ఉన్న కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉండే ఈ పండు తినడం వల్ల రక్తహీనతను తగ్గించి, ఎనీ మీడియా సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఈ పండు దంత సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది. దీనిలో ఉండే రేబో ప్లేవి, విటమిన్ ఏ కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ ఫలం స్కిన్ ఎలర్జీల, స్కిన్ క్యాన్సర్ కు దూరంగా ఉంచుతుంది. కండరాలను దృఢంగా చేస్తుంది.
పిల్లల్లో కండరాలు బలంగా ఉండడానికి, వారి ఎదుగుదలకు సీతాఫలం బాగా సహాయపడుతుంది. ఇది అలసరుపుండ్లను పూర్తిగా నయం చేస్తుంది. అలాగే మహిళల్లో జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు, పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఈ పండులో కాపర్ సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నియంతరిస్తుంది. వివిధ రకాల కీళ్ల నొప్పులకు ఈ పండు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. అయితే ఆస్తమా సమస్యతో బాధపడేవారు సీతాఫలం తీసుకోకూడదు. సీతాఫలం ఎక్కువగా తిన్నట్లయితే శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువ అవుతాయి. డయాబెటిస్ ఉన్నవారు కూడా సీతాఫలాన్ని తీసుకోకూడదు. ఓ మాదిరిగా పండిన సీతాఫలం తీసుకోవచ్చు. అధిక బరువు తగ్గాలనుకునే వారు సీతా ఫలాలు తీసుకోవడం మంచిది కానీ మితంగా తీసుకోవాలి. అయితే దీనిలో ఎక్కువ క్యాలరీలు ఉండడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది