Viral Video : దేనితోనైనా పెట్టుకోవచ్చు కానీ.. నిప్పుతో అస్సలు పెట్టుకోవద్దు. చిన్న నిప్పు రవ్వ చాలు.. అంతా నాశనం చేయడానికి. నిప్పు రవ్వ ఎక్కడ పడ్డా అక్కడ మంటలు చెలరేగుతాయి. సరైన సమయానికి మంటలను చూడకపోతే ఊళ్లకు ఊళ్లే మంటల్లో కాలిపోతాయి. అలా మంటల్లో కాలిపోయిన ఎన్నో ఇళ్లను చూశాం. ఎన్నో వాహనాలను చూశాం.. చివరకు మనుషులు కూడా కొన్ని సార్లు మంటలకు ఆహుతులవుతుంటారు. అందుకే నిప్పుతో అస్సలు పెట్టుకోకూడదని పెద్దలు అంటుంటారు. నిప్పుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటారు.

కానీ.. ఈ యువతి చూడండి.. మూకుడులో సలసలా కాగుతున్న వేడి నూనెలో చేయి పెట్టేసింది. ఏమాత్రం భయపడకుండా గరిటె అవసరం లేకుండానే వడ పావ్ లను వేసింది. వడలను చేతితోనే వేడి వేడి నూనెలో నుంచి బయటికి తీసింది. నూనె కొంచెం కాగితేనే ఆ నూనెలో చేయి పెట్టడానికి షాక్ అవుతారు. కానీ.. ఈ యువతి మాత్రం ఏం ఆలోచించకుండా అలా ఎలా నూనెలో చేయి పెట్టి వాటిని తీస్తోంది. తన చేయి కాలడం లేదా అనేదే పెద్ద ప్రశ్న.
Viral Video : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయగా.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని నాసిక్ కు చెందిన స్ట్రీట్ వెండర్ ఆమె. రోడ్డు పక్కన వడా పావ్ లు వేసుకొని జీవనం సాగిస్తూ ఉంటుంది. అయితే వడ పావ్ కోసం వాడే వడలను తయారు చేసేటప్పుడు గరిటెలను వాడకుండా ఈ యువతి డైరెక్ట్ గా చేయితోనే వాటిని వేడి వేడి నూనెలో నుంచి బయటికి తీస్తుంది. ఈ యువతి సాహసాన్ని చూసి అక్కడి వారంతా ధైర్యంగా మెచ్చుకుంటున్నారు. మీరు చేతులతో తీస్తే తీశారు కానీ.. గ్లోవ్స్ ఉపయోగించండి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం… మీరు కూడా ఆ యువతి ఎలా నూనెలో నుంచి వడలను తీస్తుందో చూడండి.