Mouth Ulcer. : పోషకాహార లోపం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. అందులో భాగంగానే నోటి పూత ఒకటి. ఇదొక్కటే కాదు… కొన్నిసార్లు పొట్ట క్లీన్ గా లేకున్నా, శరీరంలో ఉష్ణోగ్రత పెరిగిన నోటిపూత ఇబ్బంది పెడుతుంది అదేవిధంగా డిహైడ్రైషన్, వంటివన్నీ నోటిపూతకు కారణం అని చెప్పవచ్చు. ఈ సమస్య ఎదురైనప్పుడు తినడం తాగడం చాలా కష్టంగా ఉంటుంది. కాగా పెదవుల లోపల హెర్పస్ సిం ప్లేక్స్ వైరస్లు వల్ల ఏర్పడి పొక్కులు పుండ్లుగా మారుతాయి.
ఇది ఎరుపు రంగులో ఉండి ఇబ్బందికి గురిచేస్తాయి. ఇటువంటి సమయంలో నోటిపూతకు సరైన చికిత్స అవసరం. లేకపోతే సమస్య మరింత కఠినంగా మారుతుంది. అయితే మౌత్ అల్సర్లు వచ్చినప్పుడు వైద్యుల వద్దకు వెళ్లవలసిన అవసరం లేదు. కొన్ని ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Mouth Ulcer. : నోటి పూత సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా.?

తేనె…
తేనెలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియాను చంపడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది. అందువల్ల, ఇది మీ నోటిపూత సమస్యలను దూరం చేస్తుంది. నోటి పుండ్లు మీద నెయ్యి రాస్తే రెండు రోజుల్లో పుండు క్రమంగా తగ్గుతుంది.
వెల్లుల్లి…
వెల్లుల్లి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. దీని వినియోగం వల్ల నోటి అలసర్లను దూరం చేసుకోవచ్చు. అందుకోసం కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత నోటి పొక్కులపై అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ సమస్య నుంచి పూర్తి ఉపశమనం కలుగుతుంది.
టీ ట్రీ ఆయిల్..
టీ ట్రీ ఆ ఇల్లు అండ్ టీ బ్యాటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది నోటి అలసర్లను తగ్గించడంలో శక్తివంతంగా పనిచేస్తాయి. రోజు రాత్రి పడుకునే ముందు టీ ట్రీ ఆయిల్ ను పుండ్లు ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
నెయ్యి..
నెయ్యిని ఉపయోగించడం వల్ల నోటి పూత సమస్యలు తగ్గుముఖం పడతాయి. నెయ్యి అల్సర్లను నయం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. నెయ్యిని వాడిన కొద్ది రోజుల్లో నోటి అలసర్లు పూర్తిగా నయమవుతాయి. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు నోటి పొక్కులు ఉన్న ప్రదేశంలో నెయ్యిని రాసి, ఉదయాన్నే లేచి కడుక్కోవాలి. తక్షణమే ఉపశమనం లభిస్తుంది