ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రతి ఒక్కరూ తమలోని టాలెంట్ ను అందరికీ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నెట్ ఇంట్లో ఇలాంటి వీడియోలు తెగ హల్చల్ చేస్తుంటాయి. తమ టాలెంట్ను సోషల్ మీడియా ద్వారా అందరికీ పరిచయం చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే తాజాగా ఓ మహిళ చేసిన విన్యాసం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తలపై గ్యాస్ సిలిండర్ పెట్టుకొని ఆమె చేసిన డ్యాన్స్ చూసి నెటిజన్లు షాక్ అయిపోతున్నారు. ఈ వీడియో పై నటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియోలో మహిళ ఇంట్లోని ఖాళీ గ్యాస్ సిలిండర్ ను తలమీద పెట్టుకొని విన్యాసం చేసింది. అయితే ఇక్కడ ఆమెను ప్రశంసించదగిన విషయం ఏంటంటే ఆమె తల మీద గ్యాస్ సిలిండర్ తో పాటు కాళ్ళ కింద చిన్న బిందెను పెట్టుకొని ఒంటి కాలుతూ నృత్యం చేసింది. తలపై గ్యాస్ సిలిండర్ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అనుకుంటే, ఆమె తనకు ఎదురుగా ఉన్న చిన్న బిందె పైన ఎక్కి డాన్స్ కూడా చేస్తుంది. ఒంటి కాలుతో ఆ బిందెపైనా నిలబడి రౌండ్ లు తిరుగుతూ నాట్యం చేసింది. అయినా ఎక్కడ బ్యాలెన్స్ కోల్పోకుండా తల మీద సిలిండర్ పెట్టుకొని డాన్స్ చేయసాగింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి విన్యాసం ఎక్కడా చూసి ఉండరు అని కొందరు, ఈమెకు చాలా టాలెంట్ ఉందని మరికొందరు, ఇలాంటివి ఎవరు అనుకరించవద్దు అని ఇంకొందరు కామెంట్లు చేశారు. ఇప్పటిదాకా ఈ వీడియోను లక్షల మందికి పైగా వీక్షించారు. వేలల్లో లైక్స్ వస్తున్నాయి. ఈ వీడియోలోని మహిళను తమ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆడవారు మగవారికి ఏ మాత్రం సాటి రారు అని ఆ మహిళను ప్రశంస లతో ముంచెత్తుతున్నారు.
View this post on Instagram