How To Reduce Cholesterol : హ్యూమన్ శరీరంలో లిపో ప్రోటీన్ రక్తంలో అధికంగా ఉండడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ జబ్బు రావడానికి ప్రధాన కారణాలు శరీరంలో అధిక పరిమాణంలో కొలస్ట్రాలు పెరగడం వల్ల అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వ్యాధులను దూరం చేసుకోవడానికి పలు రకాల నియమాలను పాటించవలసి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో చెడు కొలెస్ట్రాలతో బాధపడేవారు అధిక సంఖ్యలో ఉన్నారు . అయితే ఈ సమస్యను నివారించడానికి కొన్ని రకాల నియమాలు పాటించవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజు వ్యాయామం చేయడం, ఆహారంతో పాటు పండ్లను తీసుకోవడం వంటి నియమాలు పాటించాలి. ఈ సమస్య నుంచి బయటపడడానికి కొన్ని రకాల పండు ఉపయోగపడతాయని చెబుతున్నారు నిపుణులు.
How To Reduce Cholesterol : ఆ పండు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
కొలెస్ట్రాల్ తగ్గుముఖం పట్టాలంటే ఏ పండ్లను తినాలి….బయట లభించే ఆహారం తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా ఎక్కువగా మద్యం సేవించడం, చక్కెర పరిమాణం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఇలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
నేరేడు పండ్లు..
శరీరానికి కావాల్సిన పలు ర కాల పోషకాలు ఈ పండ్లలో అధికంగా లభిస్తాయి. కాబట్టి గుండె సమస్యలు రాకుండా ఉపయోగపడతాయి. అంతేకాకుండా చెలు కొలెస్ట్రాలను దూరం చేసేందుకు ప్రభావవంతంగా పనిచేస్తాయి.
కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు రోజు నేరేడు పండ్లను తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు
అరటి పండ్లు…
ఫైబర్ అరటిపండ్లల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల రక్తంలోనే కొలెస్ట్రాలను సులభంగా నియంత్రిస్తుంది. అంతేకాకుండా పొట్ట సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఇందులో గ్లూకోస్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరాన్ని బలంగా చేసేందుకు సహాయపడుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి అరటిపండును రోజు ఉదయం పూట తినడం ఉత్తమం.
సిట్రస్ పండ్లు..
ఫైబర్, విటమిన్ సిట్రస్ పండ్లలో పుష్కలంగా లభిస్తుంది. ఈ పండ్లు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాలను బయటకు పంపేందుకు సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పరిమాణం ఎక్కువ… కాబట్టి శరీరంలో ఉన్న వివిధ రకాల వ్యాధులను ఈజీగా నయం చేస్తుంది.