Guppedantha Manasu 25 September 2022 Episode : రిషి వసుధార మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయా, రిషి మనసులో ఏముంది?

Guppedantha Manasu 25 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 25-September-2022 ఎపిసోడ్ 565 ముందుగా మీ కోసం రిషి షర్ట్ మీద జ్యూస్ పడడంతో రిషి రూమ్ కి వెళతాడు క్లీన్ చేసుకోడానికి, వసుధార కూడా వెళుతోంది, సారి సార్ చూసుకోకుండా వచ్చాను అని వెనక్కి తిరుగుతుంది, ఇలా కొద్దిసేపు వాళ్లు సరదాగా మాట్లాడుకున్న తర్వాత, తినడానికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు, అప్పుడు గౌతమ్ నెమ్మదిగా తినురా మళ్లీ షెట్ మీద వేస్కోకు అనీ ఇలా ఆటపట్టిస్తూ ఉంటాడు రిషి ని, వసుధారాణి నువ్వు కూడా కూర్చో తిను అని అంటూ అన్నాడు రిషి, నేను జగతి మేడంతో పాటు కలిసి తింటాను అని వసుధార అంటోంది. పర్వాలేదు వసు నువ్వు కూర్చో అని జగతి అనగానే, వసుధార కూర్చోoటుoది. రిషి స్వయంగా వసుధారకి వడ్డిస్తూ ఉంటాడు. దానిని చూసి దేవయాని రగిలిపోతూ ఉంటుంది, ఏమైంది రిషి కోపమంతా పక్కకు పెట్టాడా అని ఆలోచిస్తూ ఉంటుంది.

వసుధారని వెటకారంగా మధ్య తరగతి కుటుంబం అని ఇలా మాట్లాడుతూ ఉంటుంది, దానికి సరైన సమాధానం చెబుతుంది వసుధార, దాంతో రిషి వాళ్ల పెదనాన్న వసుధారని మెచ్చుకుంటాడు. ఇంతలో ఫోన్ వస్తుంది ధరణి కోశం డాక్టర్ ఇంటికి వస్తున్నాడు, అని రిషి వాల్ల పెదనాన్న చెబుతాడు, దాంతో దేవయాని వెటకారంగా ఇక వసుధార వెళ్లిపోవచ్చు, చాలా సేవ చేశావు అని అంటుంది. దాంతో వసుధార తినకుండానే లేచి, నేను వెళతాను, ధరణి మేడమ్ కి చెప్పి అని అంటుంది. అప్పుడు జగతి నిన్ను నేను డ్రాప్ చేస్తాను అని అనగానే, రిషి మీరేం అక్కర్లేదు మేడం, గౌతమ్ డ్రాప్చేస్తాడు అని అంటాడు, దాంతో అందరూ షాక్ అవుతారు, అసలు రిషి మనసులో ఏముందో తెలియక, రిషి అలా అనడంతో వసుధార రిషికి చెప్పకుండానే వెళ్లిపోతుంది. తర్వాత వసుధార ధరణి దగ్గరికి వెళ్లి నేను వెళుతున్నాను మేడమ్ అని చెబుతోంది, చాలా థ్యాంక్స్ వసుధార ఎంతో సేవ చేశావు అని ధరణి అంటోంది, తర్వాత వసుధార బయలు దేరుతుంది.

Guppedantha Manasu 25 September 2022 Episode : రిషి వసుధార మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయా

Guppedantha Manasu 25 September 2022 Episode
Guppedantha Manasu 25 September 2022 Episode

ఒకవైపు జగతి దేవయానితో అంటూ ఉంటుంది దయచేసి రిషీని ఇబ్బంది పెట్టకండి అని అడుగుతూ ఉంటుంది, అప్పుడు మహేంద్ర నువ్వెందుకు బతిమిలాడుతున్నది జగతి అని అంటాడు, అప్పుడు జగతి నా కొడుకు కోసమే కదా మహేంద్ర అని అంటుంది. తర్వాత దేవయాని దగ్గరికి రిషి వచ్చి పెద్దమ్మ నేను చెప్పిన విషయాన్ని ఏమి చేశారు, సాక్షికి చెప్పారా అని అనగానే, దేవయాని కంగారు పడుతూ ఆ విషయం నేను చూసుకుంటాను, నువ్వు వదిలేయి అని అంటుంది. గౌతమ్ వసుధార ని కారులో తీసుకుని వెళుతూ ఉంటాడు, అప్పుడు గౌతమ్ వసుధార తొ నువ్వు రిషికి చెప్పకుండానే వచ్చావు, వాడి సంగతి నీకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు. వెళ్లమని పర్మిషన్ ఇచ్చింది రిషి సార్ కదా అని అంటూ ఉంటుంది. ఇంతలో రిషి క్యాంటీన్లో కలుద్దాం అని మెసేజ్ పెడుతాడు, ఓకే సార్ అని అంటుంది వసుధార, అస్సలు రిషి మనసులో ఏముంది, క్యాంటీన్లో వసుధారాణి కలిసి ఏం మాట్లాడబోతున్నాడు, సాక్షి చేసిన పనికి తనకి ఎటువంటి శిక్ష విధించ బోతున్నాడు అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది.