Health Tips : వాతావరణంలోనే అనేక మార్పులు వల్ల ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రతి ఒక్కరు సీజన్ బట్టి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు పరిశుభ్రమైన నీటిని తీసుకోవాలి. సీజన్ మారుతున్న కొద్దీ ఎదురయ్యే సమస్య పొడిదగ్గు, పొడి దగ్గుతో బాధపడేవారు గోరువెచ్చని నీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. గొంతులో తడి ఆరకుండా ఉండాలి .వేడి ఆవిరి పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల గొంతులో ఉన్న శ్లేష్మం కరిగిపోతుంది. సీజన్ మారుతున్న
కొద్దీ శరీరం అనేక మార్పులకు గురి అవుతుంది . వాతావరణంలో ఏర్పడే మార్పులు వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడి జలుబు , దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఎదురవుతాయి. చల్లటి వాతావరణం, దుమ్ము బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవుల బారిన పడడం వల్ల పొడి దగ్గు వస్తుంది. ఈ సమస్యను తక్కువ లోనే అదుపు చేయకపోతే అనేక నష్టాలు కలుగుతాయి. పొడి దగ్గు వల్ల గొంతు నొప్పి, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడతారు.
Health Tips : సీజన్ వల్ల ఎదురయ్యే పొడి దగ్గుతో బాధపడుతున్నారా.

ఈ సమస్యతో బాధపడే వారు ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. దీంతోపాటు గ్రీన్ టీలో తేనె కలుపుకొని తాగితే కాస్త ఉపశమనం లభిస్తుంది. ఇలాంటి సమయంలో పాలలో నల్లమిరియాలు, చిటికెడు పసుపు వేసి గోరువెచ్చగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బ్రీతింగ్ వ్యాయామాలైన ప్రాణాయామం, యోగ వంటివి రోజు చేయాలి. ఈ సమస్య ఎక్కువగా ఉంటే అశ్రద్ధ చేయకుండా వైద్యుల సలహా తీసుకోవాలి.