Walnut : వాల్ నట్స్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల వివిధ రకాల వ్యాధులు దూరం అవుతాయి. వాల్ నట్స్ లో పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. ఖనిజాలు, ఫైబర్ ,విటమిన్లు ఆరోగ్యకరమైన మరెన్నో పోషకాలు వీటీలో దాగి ఉన్నాయి.
ఇది మెదడు ఉత్తేజితాన్ని పెంచి జ్ఞాపక శక్తిని అందించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా థైరాయిడ్ వంటి సమస్యలను దూరం చేయడంలో కూడా ఇది ప్రభావంతంగా పనిచేస్తాయి
ఉదయాన్నే పరగడుపున రెండు లేదా మూడు వాల్ నట్స్ ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఏర్పడుతుంది. దీని వినియోగం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాళీ కడుపుతో ఉదయాన్నే వాల్ నట్స్ ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు….
వాల్ నట్స్ తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులు దూరమవుతాయి. బరువు తగ్గడంలో కూడా చాలా చక్కటి పరిష్కారాన్ని చూపుతాయి. ఖాళీ కడుపుతో ఉదయాన్నే రెండు లేదా మూడు వాల్ నట్స్ తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజునే వీటితో ప్రారంభించడం వల్ల మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది. ఈజీగా బరువు తగ్గవచ్చు. నానబెట్టిన వాల్ నట్స్ ని తీసుకోవడం వల్ల పెరుగుతున్న శరీర బరువు కూడా నియంత్రించుకోవచ్చు. వీటిలో ఉండే ప్రోటీన్లు బరువు తగ్గటానికి సహాయపడతాయి. ఎందుకంటే దీనిలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. అందుకే ఇవి బరువునే నియంతరిస్తుంది.
.Walnut : ఇక ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు.

ఎముకలను బలపరుస్తుంది….
తరచుగా వాల్ నట్స్ తీసుకోవడం ద్వారా దంతాలు, ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇందులో ఉండే ఆల్ఫా_ లినోలెనిక్ యాసిడ్ ఎముకలు బలాన్ని పెంచుతుంది.
క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది….
క్యాన్సర్ రాకుండా రోజు పరిగడుపున రెండు వాల్ నట్స్ ని తీసుకోవాలి. ఇది క్యాన్సర్, ప్రోస్టేజ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వ్యాధులను తగ్గిస్తుంది. వాల్ నట్స్ లో ఉండే పాలిఫినాల్ ఎలా జీటా నిన్ లు క్యాన్సర్ నుంచి మిమ్మలను రక్షించడంలో సహాయపడతాయి.
మధుమేహాన్ని నియంత్రిస్తాయి….
మధుమేహం అదుపులో ఉండాలంటే పరిగడుపునే ఖాళీ కడుపుతో రెండు వాల్ నట్స్ తీసుకుంటే చాలు. ముఖ్యంగా దీని వినియోగం ద్వారా టైప్ టు డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి…
వాల్ నట్స్ లో ఒమేగా_3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇ వి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధానంగా పనిచేస్తాయి.