Viral Video : విద్యార్థిని స్కూల్ బ్యాగ్ లోకి దూరిన కోబ్రా.. పుస్తకాల కోసం బ్యాగులో చేయి పెట్టిన అమ్మాయికి షాక్

Viral Video : పాములు దూరని ప్లేస్ ఉండదు. పాములు ఎక్కడైనా దూరుతాయి. ఇక వర్షాకాలం, చలికాలం అయితే పాములు ఆవాసాల్లోకి కూడా వస్తాయి. ఇంట్లోకి దూరుతాయి. చివరకు షూలోనూ దూరి అందులో నిద్రపోతాయి. అవి ఎక్కడైనా ఈజీగా దూరిపోగలవు. సందు దొరికితే చాలు అవి అస్సలు ఆగవు. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ లో చోటు చేసుకుంది.

Advertisement
cobra snake found hiding inside school girl bag video viral
cobra snake found hiding inside school girl bag video viral

10 వ తరగతి చదివే ఓ విద్యార్థిని స్కూట్ బ్యాగ్ లోకి పెద్ద కోబ్రా దూరింది. బదోనీ స్కూల్ లో చదువుతున్న ఉమ రజాక్ అనే విద్యార్థిని తన బ్యాగులో ఏదో కదులుతున్నట్టుగా గమనించింది. పుస్తకాల కోసం బ్యాగులో చేయి పెట్టబోయింది కానీ.. అందులో నుంచి ఏదో బుసలు కొట్టిన సౌండ్ రావడంతో వెంటనే తన టీచర్ కు ఈ విషయం చెప్పింది.

Advertisement

Viral Video : పుస్తకాలు తీసి బ్యాగును కింద పడేసి చూసి టీచర్లు షాక్

అతడు ఆ బ్యాగ్ ను తీసి బయటికి తీసుకొచ్చి జిప్ విప్పి పుస్తకాలు బయటికి తీసి బ్యాగ్ ను ఉల్టా చేయగా.. అందులో నుంచి బుసలు కొడుతూ కోబ్రా బయటికి వచ్చింది. దాన్ని చూసి అక్కడి వారంతా షాక్ అయ్యారు. ఆ పాము అసలు ఆ బ్యాగులోకి ఎలా దూరిందా అని అందరూ షాక్ అయ్యారు. బ్యాగులో నుంచి కింద పడగానే ఆ పాము అక్కడి నుంచి తుర్రుమంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా నయం.. ఆ విద్యార్థినిని ఆ పాము కాటేయలేదు. అసలే కోబ్రా.. కాటు వేస్తే ఇంకేమైనా ఉందా? స్కూల్ లో బ్యాగ్ జిప్ తెరిచి ఉన్నప్పుడే ఆ పాము ఎప్పుడో అందులో దూరి ఉంటుందని టీచర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement