Health Tips : తోటకూరలో మాంగనీస్ చాలా ఎక్కువగా ఉంటుంది, మాంగనీస్ అధికంగా ఉన్న ఈ తోటకూరను తినడం వలన మన మెదడు కణజాలం దెబ్బతినకుండా ఉంటుంది. 150 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండేటట్టుగా మెదడు కణాల కి మాంగనీస్ బాగా పనికొస్తుంది, బ్రెయిన్ సెల్స్ బాగా ఉంటేనే మన తెలివితేటలు మేధాశక్తి బాగా ఉండి, మతిమరుపు లాంటివి రాకుండా ఉంటాయి. అందుకని మాంగనీస్ ఎక్కువగా ఉన్న ఈ తోటకూరను తినడం వలన మెదడు కణాల ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుంది .ఈ తోటకూరలో పాలతో పోలిస్తే నాలుగు రెట్లు అధికంగా క్యాల్షియం ఉంటుంది.
తోట కూర చవకగా దొరుకుతుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. అందువలన ఇతర ఆకుకూరలతో పోలిస్తే తోటకూరను అధికంగా తింటారు. సోడియం, ఐరన్, కంటికి కావాలిన విటమిన్ ఏ కూడా తోటకూరలో ఎక్కువగా ఉంటాయి. మన శరీరానికి కావలసిన పోషకాలు అన్నీ తోటకూరలో దొరుకుతాయి. తోటకూరను తినడం వలన దీనిలో ఉండే క్యాల్షియం వలన మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళు గుంజడం ఇలాంటి అన్ని సమస్యలు తగ్గుతాయి.తోట కూర మంచి ఫలితాన్ని శరీరానికి ఇస్తుంది. తోట కూర తినడం వలన బరువు కూడా తగ్గవచ్చు, దీనిలో ఉండే పీచు పదార్థం మన శరీరంలో ఉండే కొవ్వును తగ్గిస్తుంది, జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది. తోటకూరను వేపుడు చెయ్యటం కంటే కూరలుగా వండుకుని తినడం వలన శరీరానికి అధిక ప్రోటీన్స్ పొందవచ్చు. తోట కూర పప్పులో, టమాటాతో, తోట కూర పచ్చడి ఇలా చేసుకుని తింటే మంచిది.
Health Tips : తోటకూర వలన కలిగే ప్రయోజనాలు

తోటకూరను తినటం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది . దీని వలన వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు కూడా వాతావరణానికి అనుగుణంగా మన శరీరం తట్టుకొని ఉంటుంది. కేవలం శరీరానికి మాత్రమే కాకుండా జుట్టుకు కూడా తోట కూర ఎంతో మేలు చేస్తుంది . తోట కూర ఆకులను మెత్తగా పేస్టులాగా చేసుకొని, జట్టుకి పెట్టుకోవడం వలన జుట్టు దృఢపడుతుంది, చుండ్రు తగ్గుతుంది. తోటకూరలో ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ ,కాపర్ జింక్ మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలు అన్ని తోటకూరలో లభిస్తాయి. ఎముకల నిర్మాణానికి క్యాల్షియం పాస్పరస్ ఎంతో ముఖ్యమైనవి. ఈ పాస్పరస్ క్షార గుణాన్ని కలిగి ఉంటుంది, పాస్పరస్ బ్లడ్ లోకి వెళ్లి బ్లడ్ లో ఉండే ఆమ్లత్వాన్ని తగ్గించి, క్షారత్వాన్ని ఎక్కువ పెంచుతుంది.తోటకూరలో ఫైబర్ ఎక్కువగా, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఐరన్ శాతం ఎక్కువగా ఉన్న ఈ తోటకూర రక్తహీనత సమస్య ఉన్నవారికి ఒక వరమని చెప్పవచ్చు.