Flax seeds : అవిసె గింజలను ఆంగ్లములో ఫ్లాక్స్ సీడ్స్ అని అంటారు అవిసె గింజలలో ఎన్నో ఖనిజాలు, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒమేగా – 3 ఫ్యాటీ ఆమ్లాలు లభించే ఆహార పదార్థాల్లో ముఖ్యమైనది ఈ అవిసె గింజలు.రొమ్ము క్యాన్సర్, గుండెకు సంబంధించిన వ్యాధులను నివారించే శక్తి ఈ అవిసె గింజలలో ఉంది. అవిసె గింజల్లో ఉండే పీచు పదార్థం మరియు ఆరోగ్య కరమైన కొవ్వు మలబద్ధకాన్ని నివారిస్తుంది. శరీరంలోని జీవక్రియ రేటును పెంచుతుంది అంతేకాదు బరువును తగ్గడంలో కూడా అవిసె గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. హార్మోన్స్ బ్యాలెన్స్ మరియు ఆడవారిలో ఎముకలు దృఢంగా ఉండటంలో ఎంతగానో సహాయ పడతాయి.
రోజూ కొద్దిగా అవిసె గింజలను బాగా నమిలి తినడం వలన ఇందులో లభించే పోషకాలు చర్మాన్ని , జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి, ముఖ్యంగా చిన్న వయసులో వచ్చే జుట్టు రాలే సమస్యను తగ్గించి, జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేయడంలో అవిసె గింజలు ఎంతగానో మేలు చేస్తాయి అంతేకాకుండా కొలెస్ట్రాల్, మధుమేహం, గుండె పోటు ని అదుపులో ఉంచడానికి అవిసె గింజలు ఎంతో ఉపయోగపడతాయి. ప్రతి రోజూ ఉదయం ఒక స్పూన్ అవిసె గింజలను తినడం వలన కొలెస్ట్రాల్ తగ్గి,గుండెకు సంబంధించిన వ్యాధులనుండి రక్షింపబడి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అవిసె గింజలు బలమైన యాంటీఆక్సిడెంట్స్ను కలిగివుంటాయి,ఈ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని, రక్తాన్ని శుద్ధి చేస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఉదర సంబంధిత వ్యాధులకు, గ్యాస్ట్రబుల్ వంటి సమస్యలకు ఈ అవిసె గింజలు బాగా పనిచేస్తాయి.
Flax seeds : అవిసె గింజల వలన ప్రయోజనాలు.

అవిసె గింజలు స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది, జుట్టు బలంగా పొడవుగా పెరగడంలో కీలకపాత్ర వహిస్తుంది.2016 సంవత్సరంలో సి ఎస్ కె హిమాచల్ ప్రదేశ్ క్రిషి విశ్వవిద్యాలయ- ఇండియాలో జరిగిన పరిశోధన ప్రకారం అవిసె గింజలతో జెల్ తయారుచేసుకొని వాడటం వల్ల చర్మానికి , జుట్టుకి ఎన్నో లాభాలు ఉన్నాయి అని నిరూపించారు. ముఖ్యంగా జుట్టు పగలకుండా ,డ్రై అవ్వకుండా, ఊడకుండా, కొత్త వెంట్రుకలు రావడంలో ఎంతగానో దోహదపడుతుంది.ఒక కప్పు అవిసె గింజలను తీసుకొని దానికి నాలుగు కప్పుల నీళ్లు పోసి ఒక్క పన్నెండు గంటల వరకు నానబెట్టుకోవాలి,తరువాత అవిసె గింజలను నీళ్ళతోపాటు పది నుంచి పదిహేను నిమిషాలు మరిగించాలి, అది చల్లారిన తర్వాత చేతితో గింజలను వేరుచెయ్యగా, మిగిలిన జిగుడు పదార్థాన్ని జెల్ అంటారు ఇలా తయారుచేసిన జెల్ ని జుట్టుకి తలస్నానానికి ముందు అప్లై చేసుకుని ఒక 30నిమిషాలు ఉంచిన తరువాత తలస్నానం చేయడం వలన జుట్టు కి ఎంతో మేలు జరుగుతుంది. ఈ జెల్ ని స్కిన్ పై అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ లో ఉండే కొలాజెన్ డ్యామేజ్ అవ్వకుండా చేసి ముడతలు పడకుండా చర్మాన్ని కాపాడుతుంది.