Rice water Benefits : పాతకాలం మనుషులు ఎందుకు అంత ఆరోగ్యంగా ఉండేవారని ఆలోచిస్తే వారు గంజినీర్లు తాగేవారట. గంజి నీళ్లు ఒకప్పుడు పేదవారు తాగే వారట. బియ్యం కడిగి వండినప్పుడు దానిలో ఉండే పోషకాలని గంజిలోకి ఇమ్ముడుతాయి. దీనిని తీసుకున్నప్పుడు పోషకాలు అన్నీ మనకి అందుతాయి. అయితే గంజితో బోలెడు ప్రయోజనాలు ఉన్న విషయం చాలామందికి తెలియక దానిని పడేస్తున్నారు. గంజిలో ఎక్కువ విటమిన్లు, ఖనిజలు, ఏమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది కడుపులో మంట రాకుండా నివారిస్తుంది. అంతేకాకుండా అనేక రకాల రోగాలను రాకుండా అరికడుతుంది. బి విటమిన్ గంజినీటిలో అధికంగా ఉంటాయి.
అందువలన మన శరీరానికి కావాల్సిన పోషణ పూర్తిస్థాయిలో లభిస్తుంది. గంజి తాగటం వల్ల విటమిన్ లోపం రాకుండా చూసుకోవచ్చు. పిల్లలకి గంజినీరు ఇస్తే చాలా మంచిది. బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం ఆరోగ్యంగా అందంగా తయారవుతుంది. గంజిని షాంపూల హెయిర్ కండిషనర్ గా వాడడం వల్ల జుట్టు మెరిసేలా తయారవుతుంది. గంజినీటిలో ఉండే ఈ నోసి టోల్ అనే కార్బోహైడ్రేటు జుట్టు రాలడాన్ని అరికడుతుంది. శరీరంపై దురద వస్తుంటే ఆ ప్రదేశంలో గంజినీర్లతో మర్దన చేసినట్లయితే దురద పూర్తిగా తొలగిపోతాయి.
Rice water Benefits : గంజితో కలిగే ప్రయోజనాలు గురించి తెలిస్తే జీవితంలో మీరు విడిచిపెట్టరు.

పాలు తాగాని పిల్లలకి గంజి నీళ్లు ఇస్తే సరిపోతుంది. దీంతో వారికి కావాల్సిన ఆహారం ఉంది శక్తి లభిస్తుంది పోషణ కూడా అందుతుంది. బంక విరోచనాలు సమస్యతో బాధపడేవారు గంజినీర్లు తాగితే వెంటనే ఈ సమస్య నుండి విముక్తి కలుగుతుంది. ఎండ వల్ల నీరసం ఉన్నవారు త్వరగా శక్తి అందడానికి గంజి నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. వాంతులు, విరోచనాలతో బాధపడేవారు శరీరం పోషకాలను కోల్పోతుంది. అటువంటి వారు గంజినీరు తాగితే మంచిది. మరల శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజులు చేయడమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే.. గంజిలోనే పోషకాలు శరీరానికి మరింత శక్తిని లభిస్తాయి.