మనకు 60 ఏళ్ళు నిదాగానే ముందుగా ఏం చెపుతాము? ”వయసు మిదపడింది, పెన్షన్ తీసుకుని ఓ మూలకు కూర్చుని రామ రామ అంటూ కాటికి కాళ్ళు చాపాను” అంటాము. కానీ అమెరికాలోని కాలిఫోర్నియాలోని 60 నుంచి 80 ఏళ్ల వయసున్న వృద్ధులు అలా అనలేదు. మనకేం తక్కువా? మనకు శక్తి లేకపోయినా కుర్రాళ్ళ కేమి తీసిపోము. కుర్రాళ్ళను తలదన్నే సాహసం ఒకటి చేయాలి అని కొందరు అనుకున్నారు. వెంటనే స్కైడైవింగ్ క్రీడను ఎన్నుకున్నారు. అదే ఆకాశ విహంగ క్రీడ. అంటే కొన్ని వేల కిలో మిటర్లో ఎగిరే విమానంలోంచి దూకి గాలిలో దుకాలి. అంతేకాదు గాలిలో ఉండే ఆ నిముషాల వ్యవదిలో కొన్ని విన్యాసాలు చేయాలి. దీనినే స్కైడైవింగ్ గేమ్ అంటారు.
వృద్దులు అందరు కలిసిన ఐదు వేర్వేరు విమానాల్లో గగన తలానికి వెళ్లారు. వేల అడుగుల ఎత్తుకు వెళ్లాక పారాచూట్లు కట్టుకుని వరుసగా భూమి మీదికి వరుసగా దూకారు. సుమారు 194 కిలోమీటర్ల వేగంతో కిందకు దూసుకొస్తుండగా మధ్యలో అద్భుత విన్యాసం చేశారు. అన్ని విమానాల నుంచి దూకిన వారంతా ఒక్కొక్కరుగా చేతులు పట్టుకుని చివరకు ఓ అందమైన వలయంలా మారారు.
ఆ వృద్దులు అంత వేగంతో భూమి మీదకు దూసుకొస్తున్నా ఎక్కడా తడబడకుండా అనుకున్న విధంగానే పెద్ద వయలాన్ని సృష్టించారు. భూమి సమీపంలోకి వచ్చే ముందు అందరూ ఒక్కసారిగా ప్యారాచ్యూట్ ఓపెన్ చేసుకుని క్షేమంగా కిందకు దిగేశారు. ఎవ్వరికీ దెబ్బలు తగలలేదు.
చివరగా అంతా విజయకేతనం చూపుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వృద్ధుల విన్యాసానికి నెటిజన్లు దాసోహం అయ్యారు. ”మంచానికి పరిమితమయ్యే వయసులో స్కైడైవింగ్ చేయడం నిజంగా గ్రేట్ ఒక కల ఇది నిజం కాదు. మేము ఇంకా నమ్మలేక పోతున్నాము” లాంటికామెంట్లు పెడుతున్నారు. వీళ్ళు కొన్ని కోట్లమంది వృద్దులకు మార్గదర్శకులు అయ్యారు.