Viral Video : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి చాలామంది పాపులర్ అవ్వాలని వింత వింత ప్రయోగాలు చేస్తుంటే మరికొందరు నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులను పబ్లిక్ లోనే చేస్తూ జనాల చేత చివాట్లు తింటున్నారు. ఎవరు ఎన్ని తిడుతున్న బుద్ధి మారలేదు. వైరల్ కావడానికి పిచ్చి పిచ్చి పనులు చేస్తూనే ఉంటారు. మరి ముఖ్యంగా మెట్రో రైలులో ఇలాంటి పిచ్చి చేష్టలు ఎక్కువయ్యాయి. అది కూడా ఢిల్లీ మెట్రో రైల్ లోనే ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ ఆగ్రహానికి గురయ్యారు.
అందరి ముందే ప్రేమ జంట చేస్తున్న వింత పనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువ జంట ట్రైన్ ఎక్కింది. ఇక అందులో అమ్మాయి సీట్ పై కూర్చోగా అబ్బాయి మోకాళ్ళపై కూర్చున్నాడు. ఈ నేపథ్యంలో అబ్బాయి దగ్గర ఉన్న కోక్ తీసి అమ్మాయి నోట్లో కోప్పశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి నోట్లో ఉన్న ఆ కూల్ డ్రింక్ ను అబ్బాయి నోట్లోకి పోసింది. ఆ తర్వాత అబ్బాయి తన నోట్లో ఉన్న కూల్ డ్రింక్ ని కూడా అమ్మాయి నోట్లోకి పోసాడు. ఇలా ఇద్దరు కాసేపు ఆడుకుని తర్వాత అబ్బాయి ఆ కూల్ డ్రింక్ ని తాగేశాడు.
దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నీటిజనులు నోటికి పని చెప్పారు. ఘాటు మాటలతో కామెంట్స్ చేస్తూ వీడియోని మరింత వైరల్ చేస్తున్నారు. ఇక ఈ ఘటన ఢిల్లీ మెట్రోలో చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇలాంటి ఘటనలు జరగడం ఢిల్లీ మెట్రోలో ఇది మొదటిసారి అయితే కాదు. ఇంతకుముందు కూడా ఢిల్లీ మెట్రోలో ప్రేమ జంటలు వికృతి చేష్టలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీ మెట్రో ప్రతిష్టమైన నిబంధనలు కూడా పెట్టింది. అయినా కూడా ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ఘటనలు జరగడం మాత్రం ఆగడం లేదు.
Kent RO deta h sabse shudh paani#SudheerYadav pic.twitter.com/pKVu9UpagY
— सिडनी????️????वाले छाई????️????गाबा सुधीर यादव ????️???? (@AsliKhuda) October 10, 2023