సీతక్కనే సీఎం – రేవంత్ సంచలన ప్రకటన

టి. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే చర్చ విస్తృతంగా కొనసాగుతోంది. కారణం ఎన్నికలు సమీపిస్తుండటం. సీనియర్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి చాలామంది నేతలు తాము ముఖ్యమంత్రి అభ్యర్థులమేనని ప్రకటిస్తుండగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రి చెస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేవంత్. అమెరికాలో జరిగిన తానా సభల్లో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితులు, గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని రేవంత్ ను కోరారు. ఇందుకు స్పందించిన రేవంత్… కాంగ్రెస్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది. అవసరమైతే సీతక్కను కూడా ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు. సీనియర్ నేతల వ్యాఖ్యలకు చెక్ పెట్టేందుకే రేవంత్ ఈ కామెంట్స్ చేశారా..? లేక సీతక్కను సీఎం చేయాలనే ఆలోచన హైకమాండ్ పార్టీలో ఉన్నదా..? అనే చర్చ జరుగుతోంది.

Advertisement

మరోవైపు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వ్యూహాత్మకం అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే రాష్ట్రంలో మహిళల ఓటు బ్యాంక్ బీఆర్ఎస్ వైపు ఉన్నది. ఆ ఓటు బ్యాంక్ ను కాంగ్రెస్ వైపు బదలాయించేందుకు మహిళా సీఎం అభ్యర్థిత్వం అంశాన్ని రేవంత్ తెరపైకి తీసుకోచ్చారన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ తెలివిగా రాజకీయాలు చేస్తున్నారని… రేవంత్ సమయస్పూర్తికి తోడు సీనియర్ల సహకారం తోడైతే కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా ఎవరూ ఆపలేరన్న వాదనలు క్రమంగా బలపడుతున్నాయి.

Advertisement