యూపీ హత్రాస్ కు చెందిన ఓ బస్సు కండక్టర్ కదులుతున్న బస్సులోనే శృంగారం సాగించాడు. బస్సులో వింత శబ్దాలు వస్తుండటంతో తోటి ప్రయాణికులకు అనుమానం వచ్చింది. లైట్లు ఆఫ్ చేసి ఉండటంతో ఏదో జరుగుతోందని అనుమానించిన ప్యాసింజర్లు కండక్టర్ చేష్టలను వీడియో తీశారు. దాంతో యూపీ రవాణా శాఖా అతనిపై వేటు వేసింది డ్రైవర్ ను కూడా విధుల నుంచి తప్పించింది.
రాత్రి పదిగంటలకు హత్రాస్ నుంచి బస్సు బయలుదేరింది. బస్సు లక్నోకు చేరుకోవాలంటే ఉదయం అవుతుంది. కాబట్టి బస్సులో ప్రయాణికులు అంత మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. కండక్టర్ పథకం ప్రకారం లైట్లు అర్పివేశాడు. తరువాత తన పని మొదలు పెట్టాడు. నిద్రలోనున్న ప్రయాణికుల సంగతిని మరిచిన ఇద్దరు రెచ్చిపోయారు. దాంతో శబ్దాలు బయటకు వినిపించడంతో అందరూ మెల్లగా కండక్టర్ సీటు వైపు కదిలారు. ఆ సమయంలో బస్సు కండక్టర్ ఓ మహిళ ప్రయాణికురాలితో అసభ్యకర స్థితిలో కనిపించాడు.
జరుగుతోన్న తంతును అంచనా వేసిన ప్రయాణికులు వీడియో తీశారు. వెంటనే తేరుకున్న కండక్టర్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. బస్సులో ఈ పాడు పని ఏంటి కండక్టర్‌ను ప్రయాణికులు నిలదీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హత్రాస్ డిపోకు చెందిన హత్రాస్-లక్నో బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన పదిరోజుల కిందట చోటుచేసుకుంది.
Also Read : సింహాన్ని ఎదురించి అవును కాపాడిన రైతు – వీడియో వైరల్..!!