Alcohol- ఆల్కహాల్ గాజు గ్లాసులోనే ఎందుకు తీసుకుంటారో తెలుసా…?

Advertisement

ఆల్కహాల్ ఏదైనా సరే గాజు గ్లాసులోనే తీసుకుంటారు. అందరూ గాజు గ్లాసులను ప్రిఫర్ చేస్తున్నడంతో… మేము కూడా గాజు గ్లాసులనే వాడుతామని సమాధానం చెప్పేవాళ్ళే అధికం. కానీ అసలు సంగతి ఏంటో కొద్ది మందికే తెలుసు. ఇప్పుడు ఈ కథనంలో అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

Advertisement

గ్లాసులో ఏదైనా పదార్థం వేసినా, ద్రవ పదార్థాలు వేసినా వాటి రూపం స్పష్టంగా కనిపిస్తోంది. అందులో ఏమైనా క్రిమి, కీటకాలు పడినా వెంటనే తెలిసిపోతుంది. ఎవైన పదార్థాలను గాజు గ్లాసు కాకుండా ఇతర వస్తువులో వేస్తే కంటికి కనిపించవు. గాజు గ్లాస్లో వేసిన పదార్థాలు రసాయనిక చర్య జరిపి అవి రసాయన పదార్థాలను విడుదల చేయవు. రుచి, వాసన చెక్కు చెదరకుండా ఉంటాయి. కానీ ఇతర రకాల వస్తువులు మాత్రం ఇందుకు భిన్నం.

 

గాజు గ్లాసు కాకుండా ఇతర గ్లాసులో ఏ పదార్థం వేసినా వెంటనే రసాయనిక చర్య జరుపుతుంటాయి. ఫలితంగా కలర్, స్మెల్ , ఆహార్యం అంత మారుతోంది. అందుకే ఆల్కహాల్ సేవించే వారంతా గాజు గ్లాసును ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కాషాయం రంగులో ఉండే విస్కీ కావొచ్చు, క్లియర్‌గా కనిపించే వోడ్కా కావొచ్చు. ఏదైనా గాజు గ్లాసులో తమ రూపాన్ని, రంగును ఏమాత్రం మార్చువు. అందుకే ఎక్కువమంది గాజు గ్లాసులోనే ఆల్కహాల్, పానీయాలను తాగేందుకు ఇష్టపడతారు.

అంతేకాదు గాజు గ్లాసు ఉష్ణోగ్రత మార్పులను తట్టుకుంటుంది. గది ఉష్ణోగ్రతను త్వరగా చేరనీయదు. గదిలోనున్న ఉష్ణోగ్రతను ఆల్కహాల్ కు బదిలీ కాకుండా రక్షణగా నిలుస్తోంది. అందుకే ఆల్కహాల్ ను ఎక్కువ గాజు గ్లాసులోనే తీసుకుంటారు.

Also Read : కదులుతున్న బస్సులోనే కండక్టర్ శృంగారం – వీడియో తీసిన ప్యాసింజర్లు..!!

Advertisement