సింహాన్ని ఎదురించి అవును కాపాడిన రైతు – వీడియో వైరల్..!!

సింహాన్ని ఎదురించి ఓ రైతు తన ఆవును కాపాడుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనక వీడియోను వివేక్ కోటాడియా అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

Advertisement

పూర్తి వివరాల్లోకి వెళ్తే…ఓ రైతు తన ఆవులను మేపెందుకు అటవీ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఆవులన్నీ మేత మేస్తుండగా హటాత్తుగా వచ్చిన సింహం ఆ గుంపులోని ఓ ఆవుపై దాడి చేసింది. ఆవు గొంతును గట్టిగా సింహం తన నోటితో పట్టుకోవడంతో నొప్పితో విలవిల్లాడింది. తన కళ్ళ ముందే ఆవు నొప్పితో బాధపడటం చూడలేకపోయిన రైతు ఏదో ఒకటి చేయాలని తలిచాడు.

Advertisement

అవును కాపాడుకోవాలని చేయెత్తి అరుస్తూ సింహాన్ని భయపెట్టే ప్రయత్నం చేశాడు. అయిన సింహం బెదరలేదు. దాంతో తన కళ్ళను సింహాన్ని భయపెట్టే రీతిలో పెద్దవిగా చూసి అటవీ ప్రాంతమంతా దద్దరిల్లేలా అరిచాడు. ఈ క్రమంలోనే ఓ రాయి తీసుకొని సింహం వైపు వేయగానే భయపడిన సింహం ఆవును అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. ఈ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.

తన ఆవును ప్రాణాలకు తెగించి కాపాడిన రైతును నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు. అయిన వారిని కూడా సరిగా చూసుకొని ఈ సమాజంలో ఓ మూగా జంతువు కోసం ప్రాణాలకు తెగించి సాహసం చేశాడం గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement